: విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని టీడీపీ నేత నాగుల్ మీరా స్పష్టం చేశారు. విజయవాడ కార్పోరేషన్ పరిధిలోని 39 డివిజన్ పరిధిలో చోటు చేసుకొన్న పరిణామాలను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని టీడీపీ నాయకత్వం హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు.
విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని టీడీపీ నేత నాగుల్ మీరా స్పష్టం చేశారు. విజయవాడ కార్పోరేషన్ పరిధిలోని 39 డివిజన్ పరిధిలో చోటు చేసుకొన్న పరిణామాలను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని టీడీపీ నాయకత్వం హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు.
ఎవరైనా పార్టీ అధిష్టానం సూచించిన ప్రకారంగానే నడవాలని ఆయన కోరారు. 39వ డివిజన్ టికెట్ పూజితకు ఇచ్చారని నాగుల్ మీరా తెలిపారు. భీ ఫామ్ ఎవరికి ఇస్తే వారే టీడీపీ అభ్యర్ధి అని ఆయన చెప్పారు. బీ ఫామ్ ఇవ్వని వ్యక్తికి ఎలా మద్దతిస్తారని ఆయన ప్రశ్నించారు.
undefined
also read:కేశినేని నాని వర్సెస్ బుద్దా వెంకన్న: టీడీపీ సీరియస్
గత వారంలో 39వ డివిజన్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని నానిని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయులు అడ్డుకొన్నారు. పార్టీ అభ్యర్ధిని కాకుండా మరో అభ్యర్ధికి మద్దతుగా పార్టీ కార్యాలయం ఎలా ప్రారంభిస్తారని నానిని వారు ప్రశ్నించారు.
ఈ విషయమై బుద్దా వెంకన్న వర్గానికి ఎంపీ కేశినేని నానికి మధ్య మాటల యుద్దం సాగింది.ఈ విషయాన్ని టీడీపీ నాయకత్వం సీరియస్ గా తీసుకొంది. నేతలు పరస్పరం విమర్శలకు పాల్పడొద్దని ఆదేశించింది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిష్కరిస్తారని టీడీపీ నాయకత్వం ప్రకటించింది.