పుంగనూరు అల్లర్ల కేసు... కొడుకుకు బెయిల్ రాలేదని టిడిపి నేత తల్లి ఆత్మహత్యాయత్నం

By Arun Kumar P  |  First Published Sep 26, 2023, 11:32 AM IST

పుంగనూరు అల్లర్ల కేసులో అరెస్టయిన కొడుకుకు బెయిల్ రాలేదని తీవ్ర మనస్థాపానికి గురయిన ఓ టిడిపి నాయకుడి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 


చిత్తూరు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటుచేసుకున్న అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అలజడికి కారకులంటూ కొందరు  టిడిపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసాయి. ఇలా సోమశిల మండలం ఇరికిపెంట గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు నాయుడు కూడా అరెస్టయ్యాడు. అతడిపై కేసు నమోదు చేసి జైల్లో పెట్టడంతో తల్లి రాజమ్మ తీవ్ర ఆందోళనకు గురయ్యింది. ఇటీవల ఈ కేసులో కొందరు నాయకులకు బెయిల్ రాగా శ్రీనివాసులు నాయుడుకు మాత్రం రాలేదు. దీంతో మరింత ఆందోళనక చెందిన ఆ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

గత ఆదివారం పుంగనూరు అల్లర్ల కేసులో 50మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో తన కొడుకుకు కూడా బెయిల్ వచ్చివుంటుందని... కడప జైల్లో వున్న అతడు బయటకు వస్తాడని శ్రీనివాసులు నాయుడు తల్లి భావించింది. కానీ కడప జైల్లో రిమాండ్ ఖైదీగా వున్న శ్రీనివాసులు నాయుడుకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. దీంతో తన కొడుకుకు బెయిల్ లభించలేదని తెలిసి ఆ తల్లి తీవ్ర మనోవేదనకు గురయ్యింది. కొడుకు కోసం తల్లడిల్లిపోయిన రాజవ్వ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Latest Videos

Read More  పుంగనూరు అంగళ్లు కేసు: 79 మంది టీడీపీ నేతలకు బెయిల్ 

తీవ్ర అస్వస్థతకు గురయిన రాజవ్వను కుటుంబసభ్యులు వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని... ప్రస్తుతం పరిస్థితి సీరియస్ గా వున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.ఏదో ప్రమాదకర ద్రావణం తాగడంవల్లే రాజవ్వ అస్వస్థతకు గురయినట్లు... ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.

అసలేంటీ పుంగనూరు అల్లర్ల కేసు:

ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు ఇటీవల రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించే కార్యక్రమాన్ని చేపట్టారు. టిడిపి హయాంలో భారీగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టగా వైసిపి అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణంలో వున్న సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి ప్రజలకు వాస్తవాలను వివరించేందుకంటూ చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగానే తన సొంత జిల్లా చిత్తూరులోని పుంగనూరులో పర్యటిస్తుండగా అల్లర్లు చోటుచేసుకున్నాయి.  టీడీపీ, వైసీపీ వర్గీయులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గొడవలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించిన పోలీసులూ గాయపడ్డారు. 

పుంగనూరు అల్లర్లకు కారణమంటూ టిడిపి నాయకుడు చంద్రబాబుతో పాటు ఇతర నాయకులపైనా పోలీసులు కేసులు పెట్టారు. ఇలా అల్లర్ల కేసులో అరెస్ట్ చేసినవారు చిత్తూరు, మదనపల్లె, కడప జైల్లలో ఉన్నారు.వీరిలో కొందరికి ఇటీవలే బెయిల్ లభించడంతో విడుదలయ్యాయి. మిగతావారు జైళ్లలోనే వుంటున్నారు. 


 
 


 

click me!