
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ చిక్కుల్లో పడ్డారు. తాజా సంఘటనతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లనట్లు తెలుస్తోంది. పరిషత్ ఎన్నికల రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీటీసీ, ఆ గ్రామ సర్పంచ్ భర్త మరుళీకృష్ణపై కూన రవి కుమార్ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
కూన రవి కుమార్ అక్కడ ఉండగానే ఆ సంఘటన చోటు చేసుకుంది. దానికితోడు కూన రవి కుమార్ పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై మురళీకృష్ణ పొందూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు
దాంతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆయన ముందుగానే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, రవి కుమార్ ఆ సమయంలో ఇంట్లో లేరు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.