అక్రమసంబంధం అనుమానం... భార్యతో పాటు మరో మహిళను కత్తితో పొడిచి...

Arun Kumar P   | Asianet News
Published : Apr 11, 2021, 09:08 AM ISTUpdated : Apr 11, 2021, 09:19 AM IST
అక్రమసంబంధం అనుమానం... భార్యతో పాటు మరో మహిళను కత్తితో పొడిచి...

సారాంశం

 భార్య మరొకరితో అక్రమసంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తి దారుణంగా వ్యవహరించాడు. భార్యను అతి కిరాతకంగా హతమార్చడానికి ప్రయత్నించాడు ఓ కసాయి భర్త. 

కడప: అన్యోన్యంగా సాగుతున్న సంసారంలో అనుమానం పెనుభూతమయ్యింది. భార్య మరొకరితో అక్రమసంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తి దారుణంగా వ్యవహరించాడు. భార్యను అతి కిరాతకంగా హతమార్చడానికి ప్రయత్నించాడు ఓ కసాయి భర్త. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... కడప పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీలో ఓ జంట నివాసముంటోంది. కొంతకాలం అన్యోన్యంగా సాగిన వీరి జీవితాల్లోకి అనుమానం అనే పెనుభూతం ప్రవేశించింది. భార్య మరొకరితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని తనకు అన్యాయం చేస్తోందని భావించిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఈ అనుమానంతో భార్యపై ద్వేషాన్ని పెంచుకుని చివరకు కత్తితో దాడిచేని హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

అయితే భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆర్తనాదాలు విన్న ఓ మహిళ అక్కడకు వచ్చింది. రక్తపు మడుగులో పడివున్న భార్యపై భర్త కత్తితో దాడిచేస్తుండటాన్ని గమనించిన ఆమె అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో సదరు మహిళపై కూడా దుర్మార్గుడు కత్తితో దాడిచేసి గాయపర్చాడు. 

ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలతో పడివుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన ఇద్దరు మహిళలను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?