మాజీ డిప్యూటీ సీఎం సోదరుడి కొడుకు వీరంగం... మద్యంమత్తులో ఇతరులపైకి కారు ఎక్కిస్తూ

Published : May 16, 2023, 01:02 PM IST
మాజీ డిప్యూటీ సీఎం సోదరుడి కొడుకు వీరంగం... మద్యంమత్తులో ఇతరులపైకి కారు ఎక్కిస్తూ

సారాంశం

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు తాగిన మైకంలో భీభత్సం సృష్టించాడు. 

కర్నూల్ :మాజీ డిప్యూటి సీఎం, టిడిపి నాయకుడకు కేఈ కృష్ణమూర్తి సోదరుడి కుమారుడు మద్యం మత్తులో హల్  చల్  చేసాడు. కర్నూల్ పట్టణంలోని సుంకేసుల రోడ్డులో స్వయంగా కారు నడుపుకుంటూ వెళుతూ వాహనానాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. అక్కడితో ఆగకుండా డివైడర్ ను ఢీకొట్టి కారు ఆగింది. కేఈ సోదరుడి కొడుకు కారు ఢీకొని నలుగురికి గాయాలవగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూల్ లోని కార్తీక్ హాస్పిటల్ వద్దకు సోమవారం మధ్యాహ్నం మాజీ డిప్యూటీ సీఎం కేఈ సోదరుడి కొడుకు వచ్చాడు. మద్యం మత్తులో ఇన్నోవా కారును నడుపుకుంటూ వచ్చిన అతడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసాడు. మద్యం మత్తులో జాతీయ రహదారిపై కారును వేగంగా పోనిస్తూ అడ్డువచ్చిన వాహనాలకు ఢీకొట్టాడు. ఇలా నాలుగు ద్విచక్ర వాహనాలతో పాటు ఓ ఆటోను ఢీకొట్టాడు. అయినా ఆగకుండా ముందుకు దూసుకెళ్లి డివైడర్ ను గుద్ది ఆగింది ఇన్నోవా. 

ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారులు సతీష్, తిరుమలేశ్, రాజేష్, నాగరాజు తో పాటు ఆటో డ్రైవర్ షావలి గాయాలపాలయ్యారు. వీరిలో తిరుమలేశ్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో వున్నట్లు సమాచారం. ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కర్నూల్ లోని వివిధ హాస్పిటల్స్ లో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. 

Read More  ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం... టిడిపి మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు

కారు భీభత్సంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన స్థానికులు కేఈ సోదరుడి కొడుకును కారులోంచి లాగి దేహశుద్ది చేసారు. విషయం తెలిసి పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేసరికి కేఈ సోదరుడి కొడుకు అక్కడినుండి తప్పించుకున్నాడు. డివైడర్ ను ఢీకొని రోడ్డుగా అడ్డంగా ఆగిన ఇన్నోవా కారును పక్కకు జరిపించి ట్రాఫిక్ జామ్ కాకుండా చూసారు పోలీసులు. ప్రమాద స్థలానికి సమీపంలోని సిసి కెమెరాల ఆధారంగా కారు నడిపిందెవరో గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారేకాదు ఎవ్వరూ ఇప్పటివరకు తమకు పిర్యాదు చేయలేదని డిఎస్పీ తెలిపారు. కేవలం ఘటన జరిగిన తర్వాత ఎవరో డయల్ 100 కు ఫోన్ చేస్తే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారని అన్నారు. ఈ ప్రమాదానికి కారణమైనవారు ఎవరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Ibrahimpatnam Tour: జగన్ పర్యటనలో జనసంద్రమైన రోడ్లు| Asianet News Telugu
YS Jagan Visits Jogi Ramesh House: జోగి రమేష్ ఇంటిని పరిశీలించిన జగన్ | Asianet News Telugu