రాష్ట్రంలో ప్రతి ప్రాణి ఆలోచించాల్సిన అవసరం ఉంది: జేసీ ప్రభాకర్ రెడ్డి

By narsimha lode  |  First Published Jan 5, 2023, 5:19 PM IST

రాష్ట్ర ప్రభుత్వంపై   తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో  ప్రతి ప్రాణి ఆలోచించాల్సిన అవసరం నెలకొందన్నారు. 
 


అనంతపురం: రాష్ట్రంలో ప్రతి ప్రాణి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని  మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి  చెప్పారు. గురువారంనాడు ఆయన తాడిపత్రిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో  స్వాతంత్ర్య  ఉద్యమం నాటి పరిస్థితులు కన్పిస్తున్నాయన్నారు. ఏపీలో మాట్లాడే హక్కు కొరవడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  సీఎం వైఖరితో  ప్రజలతో  పాటు  పశుపక్షాదులు కూడా ఇష్టపడడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి  విమర్శించారు.అవకాశం చిక్కితే  రాష్ట్ర ప్రభుత్వంపై  మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పిస్తారు. రాష్ట్రంలో  మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించినా  తాడిపత్రిలో టీడీపీ విజయం సాధించింది.  టీడీపీ విజయంలో  జేసీ బ్రదర్స్ కీలకంగా వ్యవహరించారు.  

రాష్ట్ర ప్రభుత్వం  జీవో 1 నెంబర్  విడుదల చేయడంపై   టీడీపీ నేతలు మండిపడుతున్నారు.  తమ పార్టీ ర్యాలీలు, సభలు అడ్డుకొనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో జారీ చేసిందని   టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనను  కూడా  ఇదే జీవోను అడ్డుపెట్టుకొని  పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేశారు.  తాను సీఎంగా  ఉన్న సమయంలో  ఇలానే అడ్డుకొంటే  జగన్ పాదయాత్ర  చేసేవాడా అని  చంద్రబాబు ఇవాళ ప్రశ్నించారు.చంద్రబాబు కందుకూరులో నిర్వహించిన రోడ్ షోలో ఎనిమిది మంది ,,గుంటూరు సభలో  ముగ్గురు మృతి చెందడం వల్లే  ఈ జీవో తీసుకురావాల్సి వచ్చిందని  రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది.  అమాయకులు ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశ్యంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని  ప్రభుత్వం ప్రకటించింది.
 

Latest Videos

click me!