బస్సు యాత్రపై ప్రజలు రాళ్లు వేస్తారు: వైసీపీపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి

Published : May 22, 2022, 02:40 PM ISTUpdated : May 22, 2022, 02:44 PM IST
బస్సు యాత్రపై ప్రజలు రాళ్లు  వేస్తారు:  వైసీపీపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి

సారాంశం

వైసీపీ బస్సు యాత్రపై ప్రజలు రాళ్లు వేస్తారేమోనని తాడిపత్రి మున్సిపల్ చైర్ పర్సన్ జేసీ ప్రభాకకర్ రెడ్డి చెప్పారు.  ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. 

అనంతపురం:  ఈ నెల 26 నుండి ప్రారంభం కానున్న మంత్రుల బస్సు యాత్రపై ప్రజలు రాళ్లు వేస్తారేమోనని తాడిపత్రి మున్సిపల్ చైర్ పర్సన్, టీడీపీ నేత  JC Prabhakar Reddy  చెప్పారు.

ఆదివారం నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రుల Bus Yatraకు రక్షణను పెంచుకోవాలని ఆయన సూచించారు.  YS jagan సర్కార్ పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. YCP  ప్రభుత్వం  పాలనలో విఫలమైందన్నారు. అందుకే గడప గడపకు అంటూ ఆ పార్టీ ప్రచారం ప్రారంభించిందన్నారు. గడప గడపకు వైసీపీ నేతలు వెళ్తే రాళ్లతొ కొడతారన్నారు.. వైసీపీ నేతలు గడప గడపకు వెళ్లడానికి అనుమతులు తెచ్చుకోవాలన్నారు.

రాయదుర్గంలో స్వామి వారి కళ్యాణోత్సవంలో తప్పు చేశారని ఆయన మండిపడ్డారు. తమ పార్టీ నేత కాలువ శ్రీనివాసులును ఆలయంలోనికి రాకుండా అడ్డుకోవడాన్ని ఆయన తప్పు బట్టారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. త్వరలోనే తాను మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులుతో కలిసి ఆలయానికి వెళ్తానని ఆయన చెప్పారు. తప్పులు ఒప్పుకోకుండా సవాల్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తాడిపత్రిలో జాతీయ స్థాయి గ్రామీణ క్రీడలను నిర్వహిస్తామని కూడా ఆయన చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
Chitha Vijay Prathap Reddy: ఫుడ్ కమిషన్ చైర్మన్ కే పంచ్ లు నవ్వు ఆపుకోలేకపోయిన అధికారులు| Asianet