పెద్దారెడ్డి చెప్పుతో కొడితే కొట్టించుకొంటా: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం

Published : Dec 30, 2020, 04:50 PM IST
పెద్దారెడ్డి చెప్పుతో కొడితే కొట్టించుకొంటా: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం

సారాంశం

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పుతో కొడితే కొట్టించుకొంటానని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు

అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పుతో కొడితే కొట్టించుకొంటానని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

బుధవారం నాడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.చెప్పుతో కొట్టించుకొంటే అదృష్టం పడుతుంది అంటారని ఆయన వ్యంగ్యాస్రాలు సంధించారు.

also read:జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై దాడి: ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు అరెస్ట్, కారు సీజ్

పెద్దారెడ్డి మాటలు చూసి తాడిపత్రి వాళ్లంతా మూర్ఖులనుకొంటున్నారని ఆయన చెప్పారు.అరెస్ట్ కు తాను రెడీగా ఉన్నానని ఆయన ప్రకటించారు.డాక్టర్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తాము కేసు పెట్టకపోయినా కూడ పెద్దారెడ్డీ వర్గీయులపై అట్రాసిటీ కేసు ఎలా పెట్టారని ఆయన ప్రశ్నించారు.అట్రాసిటీ కేసును పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన  చెప్పారు.

ఈ నెల 24వ తేదీన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి జేసీ వర్గీయులపై  పెద్దారెడ్డితో పాటు ఆయన వర్గీయులు దాడికి దిగారు.ఈ ఘటన తర్వాత ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. ఈ  ఘటనపై  ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. ఇరువర్గాలకు చెందిన పలువురిని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu