టీడీపీకి గుడ్ బై చెప్పనున్న మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ?.. వైసీపీ నుంచి బంపర్ ఆఫర్..!

Published : Feb 13, 2023, 11:32 AM IST
టీడీపీకి గుడ్ బై చెప్పనున్న మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ?.. వైసీపీ నుంచి బంపర్ ఆఫర్..!

సారాంశం

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కైకలూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. 

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కైకలూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. త్వరలోనే వెంకటరమణ వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గత కొంతకాలంగా టీడీపీలో చోటుచేసుకుంటున్న అంతర్గత పరిణామాలు, వచ్చే ఎన్నికల్లో కైకలూరు టికెట్ విషయంలో పార్టీ అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంతోనే వెంకటరమణ పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది.

వైసీపీలో చేరాలని భావిస్తున్న వెంకటరమణకు ఆ  పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.. ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ చేశారనే ప్రచారం కూడా ఆయన సన్నిహిత వర్గాల్లో జరుగుతుంది.  ఇక, పార్టీ మార్పు, వైసీపీలో చేరికపై వెంకటరమణ ఈ రోజు సాయంత్రం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై జయమంగళ వెంకటరమణ అసంతృప్తితో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కైకలూరు నుంచి టికెట్ కేటాయించే విషయంలో అధిష్టానం హామీ ఇవ్వకపోవడంపై వెంకటరమణ అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ ఇతర పార్టీలతో పొత్తులుంటే తన టికెట్ పరిస్థితి ఏమిటనే దానిపై ఆయన ఆవేదనతో ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారని సమాచారం. 

ఇటీవల జయమంగళ వెంకటరమణతో వైసీపీ ముఖ్య నేతలు కొందరు సంప్రదింపులు జరిపారని.. పార్టీలో చేరితే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని అధిష్టానం నుంచి హామీ కూడా లభించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెంకటరమణ టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!