స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు
స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని ప్రకటించిన ఆయన విజయవాడ బయల్దేరారు.
మరోవైపు పులివెందుల, జమ్మలమడుగులో ఏకపక్షంగా స్థానిక ఎన్నికలు జరిగిలా వైసీపీ వ్యూహం పన్నుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని దశాబ్ధాలుగా ఢీకొడుతూ వస్తున్న సతీశ్ రెడ్డి మార్చి 13న వైసీపీలో చేరనున్నారు.
Also Read:వైసీపీలో చేరలేదు, టీడీపీలోనే ఉన్నా: రామసుబ్బారెడ్డి
సోమవారం నాడు జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొండాపూరం, ముద్దనూరు మండలాల కార్యకర్తల తో సమావేశం కాకపోవడంపై రామసుబ్బారెడ్డి టీడీపీని వీడే అవకాశం ఉందనే ప్రచారానికి మరింత ఊతం ఇచ్చింది.
దీంతో రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను టీడీపీలోనే ఉన్నానని ఆయన చెప్పారు. తాను టీడీపీలోనే ఉన్నానని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ మారే ఉద్దేశం ఉంటే తాను బహిరంగంగానే ప్రకటిస్తానన్నారు.
Also Read:తొలి ఓటు టీడీపీకే, 34 ఏళ్ల బంధం.. గుండెల్లో చెప్పలేని బాధ: కదిరి బాబూరావు
పార్టీ ఆవిర్భావం నుండి తాను టీడీపీలోనే ఉన్నానని ఆయన గుర్తు చేశారు. తన బాబాయ్ శివారెడ్డి కాలం నుండి తాను అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా తప్పుడు ప్రచారం చేశారని ఆయనమీడియాపై మండిపడ్డారు.