బెదిరింపులు, ప్రలోభాలతో చేర్చుకొంటున్నారు.: వైసీపీలో చేరికలపై బాబు ఫైర్

By narsimha lode  |  First Published Mar 10, 2020, 5:53 PM IST

వైసీపీ నాయకత్వం ప్రలోభాలు పెట్టి తమ పార్టీ నేతలను చేర్చుకొంటుందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. పార్టీ మారేందుకు ఇష్టపడని నేతలను బెదిరిస్తున్నారన్నారు. 
 



అమరావతి:వైసీపీ నాయకత్వం ప్రలోభాలు పెట్టి తమ పార్టీ నేతలను చేర్చుకొంటుందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. పార్టీ మారేందుకు ఇష్టపడని నేతలను బెదిరిస్తున్నారన్నారు. 

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  మంగళవారం నాడు సాయంత్రం అమరావతిలో మీడియాతో మాట్లాడారు. సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నందని వైసీపీపై  మండిపడ్డారు.

Latest Videos

undefined

మరో వైపు వైసీపీలో ప్రజలు చేరడం లేదన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలయ్యే అవకాశం ఉందని భావించి   తమ పార్టీకి చెందిన నేతలను  వైసీపీలో చేర్చుకొంటున్నారని చెప్పారు చంద్రబాబు.

గ్రామపంచాయితీలకు వైసీపీ రంగులు వేయడానికి రూ. 3 వేల కోట్లు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. ఈ నిధులన్నీ వృధా చేశారని బాబు విమర్శించారు.కొందరు అధికారులు  తమ పార్టీకి చెందిన అభ్యర్థులకు  కుల ధృవీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

ఒకవేళ  ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించలేకపోతే ఎన్నికల సంఘం  చేతులు ముడుచుకోవాలని  ఆయన హితవు పలికారు.తమ పార్టీకి చెందిన నేతలపై  తప్పుడు కేసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. మద్యం, డబ్బులు పంచకూడదని తమ పార్టీ నేతలకు సూచించినట్టుగా బాబు గుర్తు చేశారు.

డబ్బులు ఖర్చు పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీపై విమర్శలు చేశారు.. తమ పార్టీకి చెందిన నేతలు పోటీ చేయకుండా అధికార పార్టీ  బలవంతంగా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని చంద్రబాబు ఆరోపణలు చేశారు. 

click me!