రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా సీనియర్ నేత వర్ల రామయ్యగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన వర్ల అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు.
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా సీనియర్ నేత వర్ల రామయ్యగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన వర్ల అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు.
రాజ్యసభ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేందరికీ విప్ జారీ చేస్తామని, పార్టీ ఏజెంట్‌కు చూపించి ఓటేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే అనర్హత వేటు పడుతుందని టీడీపీ అధినేత హెచ్చరించారు. అటు వైసీపీ ఇప్పటికే తమ పార్టీ తరపు నుంచి మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీని అభ్యర్ధులుగా ఎంపిక చేశారు.
undefined
Also Read:బెదిరింపులు, ప్రలోభాలతో చేర్చుకొంటున్నారు.: వైసీపీలో చేరికలపై బాబు ఫైర్
మరో వైపు వైసీపీలో ప్రజలు చేరడం లేదన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలయ్యే అవకాశం ఉందని భావించి తమ పార్టీకి చెందిన నేతలను వైసీపీలో చేర్చుకొంటున్నారని చెప్పారు చంద్రబాబు.
గ్రామపంచాయితీలకు వైసీపీ రంగులు వేయడానికి రూ. 3 వేల కోట్లు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. ఈ నిధులన్నీ వృధా చేశారని బాబు విమర్శించారు.కొందరు అధికారులు తమ పార్టీకి చెందిన అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read:జగన్‌తో నత్వానీ భేటీ:ఏపీ అభివృద్ది కోసం కృషి చేస్తా
ఒకవేళ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించలేకపోతే ఎన్నికల సంఘం చేతులు ముడుచుకోవాలని ఆయన హితవు పలికారు.తమ పార్టీకి చెందిన నేతలపై తప్పుడు కేసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. మద్యం, డబ్బులు పంచకూడదని తమ పార్టీ నేతలకు సూచించినట్టుగా బాబు గుర్తు చేశారు.
డబ్బులు ఖర్చు పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీపై విమర్శలు చేశారు.. తమ పార్టీకి చెందిన నేతలు పోటీ చేయకుండా అధికార పార్టీ బలవంతంగా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని చంద్రబాబు ఆరోపణలు చేశారు.