నెల్లూరులో టీడీపీ నేత ఇంటిని కూల్చివేసిన అధికారులు, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Aug 13, 2019, 10:08 AM ISTUpdated : Aug 13, 2019, 11:45 AM IST
నెల్లూరులో టీడీపీ నేత ఇంటిని కూల్చివేసిన అధికారులు, ఉద్రిక్తత

సారాంశం

తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించిన కొద్దిరోజుల్లోనే నెల్లూరు టీడీపీ నేత ఇంటిని అధికారులు కూల్చేవేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది

తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించిన కొద్దిరోజుల్లోనే నెల్లూరు టీడీపీ నేత ఇంటిని అధికారులు కూల్చేవేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

నగరంలోని వెంకటేశ్వరపురంలో నివసిస్తున్న తెలుగుదేశం నేత జహీర్ అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారంటూ అధికారులు ఆయన ఇంటిని కూల్చివేశారు. సమాచారం అందుకున్న టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు.

వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై కక్షసాధింపులకు దిగుతోందని మండిపడ్డారు. ఈ క్రమంలో తెలుగుదేశం నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో నెల్లూరులో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు
Minister Narayana: అమరావతికి కొత్త దారి.. పరిశీలించిన మంత్రి నారాయణ | Asianet News Telugu