జగన్ పుట్టుకే వైఎస్ కుటుంబానికి శాపం..: సజ్జలకు ధూళిపాళ్ల స్ట్రాంగ్ కౌంటర్

Published : Jun 04, 2023, 01:51 PM ISTUpdated : Jun 04, 2023, 01:55 PM IST
జగన్ పుట్టుకే వైఎస్ కుటుంబానికి శాపం..: సజ్జలకు ధూళిపాళ్ల స్ట్రాంగ్ కౌంటర్

సారాంశం

ప్రభుత్వ సలహాదారు, వైసిపి నేత సజ్జల రామకృష్ణా రెడ్డికి టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్ర స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి ధూళిపాళ్ల నరేంద్ర కౌంటరిచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై యువగళం పాదయాత్రలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ హడావుడి చేస్తున్న లోకేష్ కు తల్లి గర్భంలోనే మానసిక వైకల్యం ఏర్పడిందేమో అంటూ సజ్జల సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ప్రస్ట్రేషన్ లో సజ్జల నొటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని టిడిపి నేత ధూళిపాళ్ళ సీరియస్ అయ్యారు. 

తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి పదవికోసం పాకులాడిన నీతిమాలిన నాయకుడి వద్ద పనిచేస్తున్న మీరా పుట్టుకల గురించి మాట్లాడేది అంటూ సజ్జలకు ధూళిపాళ్ళ కౌంటరిచ్చారు. ఇలాంటి మాటలు మీ నోటివెంట వస్తే జనం హర్షించరని అన్నారు. సైకో ఎవరో... మానసిక వైఫల్యంతో బాధపడేది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఎవరి పుట్టుక రాష్ట్రానికే కాదు సొంత కుటుంబానికి శాపంగా మారిందో యావత్ తెలుగు ప్రజలకు తెలుసంటూ వైఎస్ జగన్ పై ధూళిపాళ్ల విరుచుకుపడ్డారు. 

Read More  జనంలో వుంటే మంచిదే .. కానీ ఎంత వరకు తిరుగుతాడో : పవన్ వారాహి యాత్రపై సజ్జల సెటైర్లు

టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న సజ్జల లాంటి బాడుగ నేతల భరతం పడతా... అందరి లెక్కలు తేలుస్తామని ధూళిపాళ్ల హెచ్చరించారు. ఓ క్రిమినల్ కోసం క్రిమినల్ పనులు చేస్తున్నవారు రేపు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సజ్జల లాంటివారి భవిష్యత్ దుర్భరంగా వుండబోతోందని... ఆయన అహంకారం కుప్పకూలుతుందని అన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే బాడుగ నేతల లెక్క తేలుస్తామని.. అప్పుడు మీ బానిసత్వం, మీ పుట్టుక మీకే  అసహ్యాన్ని కలిగిస్తుందంటూ సజ్జలకు ధూళిపాళ్ళ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu