గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. ఇసుక మాఫియా పనే, వీడియో పోస్ట్ చేసిన దేవినేని ఉమా

Siva Kodati |  
Published : Mar 24, 2022, 02:32 PM IST
గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. ఇసుక మాఫియా పనే, వీడియో పోస్ట్ చేసిన దేవినేని ఉమా

సారాంశం

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. కావాలనే అధికార పార్టీ నేతలు విగ్రహాన్ని కూలగొట్టించారని టీడీపీ నేతలు  ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ ధ్వంసానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమా. 

కృష్ణా జిల్లాలో (krishna district) ఎన్టీఆర్ విగ్రహాన్ని (ntr statue) ధ్వంసం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. గుడివాడ నియోజకవర్గం (gudivada) గుడ్లవల్లేరు మండలంలోని (gudlavalleru) మచిలీపట్నం-కల్లూరు జాతీయ రహదారిపై ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీనిపై టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే లారీతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఢీకొట్టించి పడేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేత దేవినేని ఉమా (devineni uma) స్పందించారు. ఈ మేరకు విగ్ర‌హాన్ని లారీ ఢీ కొట్టిన వీడియోను పోస్ట్ చేశారు. 

'గుడ్లవల్లేరులో ఉదయం ట్రాఫిక్ లేని సమయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని లారీ ఢీ కొట్టింది. సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనబడింది. ఇసుక మాఫియా విగ్రహ ధ్వంసానికి పాల్పడింది. విధ్వంస సూత్రధారులు, వెనక ఉన్న పాత్రధారులను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలి' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

కాగా.. గురువారం గుడ్లవల్లేరులో ఓ లారీ అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసమయ్యింది. ఈ విషయంలో తెలిసిన వెంటనే టీడీనీ గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరావు, గుడ్లవల్లేరు తెలుగుదేశం పార్టీ నాయకులు గుడ్లవల్లేరు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా వాటర్ ప్లాంట్ దగ్గరున్న సిసి టీవీ పుటిజ్ పరిశీలించగా ఎన్ టి ఆర్ విగ్రహాన్ని హుస్సేన్ పాలెంకి చెందిన టిప్పర్ లారీ ఢీ కొట్టినట్లు గుర్తించామని ఎస్ఐ తెలిపారు. 

ఫుటేజీ ఆధారంగా సదరు లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు. అయితే, సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన టీడీపీ నేతలు.. కావాలనే లారితో గుద్దినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా వెళ్లాల్సిన లారీ సరిగ్గా విగ్రహం దగ్గరికి వచ్చేసరికి ఎలా అదుపుతప్పిందని.. ఇది కావాలనే చేసినట్లుగా ఉందని ఎన్టీఆర్ అభిమానులుకూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే, గన్నవరం మండలం పురుషోత్తపట్నం- కొండపాలూరు బాబు జగజ్జివన్ రావు విగ్రహం వద్ద నెలకొన్న వివాదంలో అర్ధరాత్రి పోలీసులు బలగాలు గ్రామస్తులను చెదరగొట్టారు. వివాదం నేపథ్యంలో ఇరు గ్రామాల పెద్దలతో నూజివీడు ఆర్టీవో రాజ్యలక్ష్మి, తూర్పు ఏసిపి విజయ్ పాల్ చర్చలు జరిపారు. చర్చలు విఫలమవడంతో ఇరు గ్రామస్తులను గన్నవరం పోలీసులు వారి ఇళ్లకు పంపివేశారు. అనంతరం ఎలాంటి వివాదాలు తలెత్తకుండా బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద పోలీసు బలగాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని రెండు గ్రామాల మహిళలు భయాందోళనతో ఉన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Serious: ఈ హాస్టల్ కంటే జైల్ బెటర్.. పిల్లలు ఏడుపే తక్కువ | Asianet News Telugu
బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu