కక్షగట్టి పోలవరం పనులు ఆపించారు: జగన్‌పై దేవినేని ఫైర్

By Siva KodatiFirst Published Jul 31, 2019, 11:34 AM IST
Highlights

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్ట్‌లపై వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని నదులను అనుసంధానం చేసేందుకు చంద్రబాబు ప్రణాళికను సిద్ధం చేస్తే జగన్ ఓర్చుకోలేకపోతున్నారని దేవినేని మండిపడ్డారు. 

వంశధార్ స్టేజ్-2, ఫేజ్-2 గురించి సీఎం సెక్రటరీగా ఉన్న ధనుంజయరెడ్డిని అడిగితే కరెక్ట్‌గా చెబుతారని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. నాగావళి-బహుదా-వంశధార-చంపావతి-వేదవతి పనులను ఎందుకు నిలిపివేశారని ఉమా ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్ట్‌లో 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేశామని.. దీనికి గిన్నిస్ రికార్డుతో పాటు అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయని దేవినేని గుర్తు చేశారు.

గోదావరి నీటిని తెలంగాణలో ఎలా పారించాలో ప్లానింగ్ ఇవ్వాలని ఏపీ ఇంజనీరింగ్ అధికారులను జగన్ హైదరాబాద్‌లో కూర్చొబెట్టారని ఉమా ఆరోపించారు. జగన్ సర్కార్ కక్షగట్టి పోలవరం పనులను నిలిపివేశారని దేవినేని మండిపడ్డారు. 

click me!