ఏపీ ఎన్నికల ప్రధానాధికారిపై టీడీపీ ఫిర్యాదు

Published : May 07, 2019, 03:51 PM IST
ఏపీ ఎన్నికల ప్రధానాధికారిపై టీడీపీ ఫిర్యాదు

సారాంశం

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై టీడీపీ నేత దేవీ బాబు మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు.  

న్యూఢిల్లీ: ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై టీడీపీ నేత దేవీ బాబు మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు.

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘిస్తూ కడప జిల్లాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను కూడ ప్రదర్శించిన విషయాన్ని  ఆయన ప్రస్తావించారు.

వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన సీఈఓపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మరోవైపు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై కూడ ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా సీఎస్ వ్యవహరించారని ఆయన ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!