అమరావతికి కోటి విరాళం ఇచ్చిన వృద్ధురాలు మృతి.. చంద్రబాబు సంతాపం..

Published : Feb 13, 2021, 12:28 PM IST
అమరావతికి కోటి విరాళం ఇచ్చిన వృద్ధురాలు మృతి.. చంద్రబాబు సంతాపం..

సారాంశం

ప్రముఖ సంఘసేవకురాలు, విద్యాభివృద్ధికి కృషి చేసిన  ఆదర్శ మహిళ  ముప్పవరపు స్వరాజ్యమ్మ మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. 

ప్రముఖ సంఘసేవకురాలు, విద్యాభివృద్ధికి కృషి చేసిన  ఆదర్శ మహిళ  ముప్పవరపు స్వరాజ్యమ్మ మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి స్వరాజ్యమ్మ కోటి రూపాయలు విరాళం అందజేశారని గుర్తు చేసుకున్నారు. రాజధాని అభివృద్ధికి ఆమె కృషి, తపన మరువలేనివని అన్నారు. 

విద్యా వ్యాప్తికి విశేషమైన కృషి చేయడంతో పాటు పాఠశాలల నిర్మాణానికి, సేవా కార్యక్రమాలకు స్థలాలు కూడా దానం చేశారని ముప్పవరపు స్వరాజ్యమ్మ గురించి పేర్కొన్నారు. 

ప్రకృతి విపత్తుల సమయంలోనూ అనేక సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన స్వరాజ్యమ్మ మృతి చెందడం బాధాకరం అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మంగళగిరి మండలం నీరుకొండ గ్రామానికి చెందిన ముప్పవరపు స్వరాజ్యమ్మ అమరావతిలో రాజధాని నిర్మాణానికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు. వ్యవసాయం ద్వారా వచ్చిన సొమ్ములోనుంచి ఈ విరాళం అందిస్తున్నట్టుగా ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెక్కును అందించారు. గతంలో సమైక్య రాష్ట్రంలో కూడా కర్నూలు వరద బాధితుల కోసం ఆమె రెండు లక్షల విరాళం అందించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?