విలువ లేని మాటలకు మేం స్పందించాలా.. రోజా వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న కౌంటర్

Siva Kodati |  
Published : Mar 13, 2022, 02:25 PM IST
విలువ లేని మాటలకు మేం స్పందించాలా.. రోజా వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న కౌంటర్

సారాంశం

వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజా టీడీపీ నేతలపై చేసిన  వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న. రోజా మాటలకు విలువ లేదని.. అందువల్ల ఆమె వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని వెంకన్న పేర్కొన్నారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై (ys jagan) టీడీపీ నేత (tdp)  బుద్ధా వెంక‌న్న (buddha venkanna ) మండిపడ్డారు. వైఎస్ వివేకానంద‌రెడ్డిని (ys vivekananda reddy) ఎవరు హత్యచేశారో జ‌గ‌న్ చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఉన్న వివేకా కుమార్తె సునీతకు రక్షణ కల్పించాలని బుద్ధా వెంకన్న కోరారు. ఇటీవ‌ల త‌మ‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ప‌లు వ్యాఖ్య‌లు చేశార‌ని, అస‌లు ఆమె మాటలకు విలువ ఉండదని ఆయ‌న చెప్పారు. అందువల్ల రోజా (rk roja) చేసిన వ్యాఖ్యలపై తాము స్పందించాల్సిన అవసరం లేదని బుద్ధా తేల్చిచెప్పారు. కాగా, విజ‌య‌వాడ‌లో జనసేన (janasena) క‌ట్టుకున్న‌ బ్యానర్లను తొలగించడాన్ని ఆయన ఖండించారు. 

ఇటీవల రోజా మాట్లాడుతూ.. మహిళలు జై jagan అంటే నారావారి గుండెల్లో రీసౌండ్ రావాలి అంటూ పేర్కొన్నారు. Inernational Women's Day సందర్భంగా ఆమె ఉద్విగ్నంగా మాట్లాడారు. ఈ‌ రాష్ట్రంలో మహిళ నేడు ఆత్మాభిమానంతో జీవిస్తోందన్నారు. సీఎం‌ జగన్ నేడు మహిళా సాధికారతకు అవకాశం కల్పించారన్నారు. తన 20 సంవత్సరాల‌ రాజకీయ జీవితంలో ఈ రోజు ఆనందంగా మాట్లాడుతున్నానన్నారు. ఇంకా రోజా మాట్లాడుతూ.. ‘‘ఎందరో నాయకులు వచ్చి వెళ్ళారు. వారెవరికీ సాధ్యం కాని సాధికారత సీఎం జగన్ చేసి చూపించారు. 

మహిళలు గతంలో పోలీసుల దెబ్బలు తినేవారు. కానీ, జగన్ ఏ మహిళా‌ సంఘం పోరాడకుండా మహిళలకు పట్టం కట్టారు. సీఎం జగన్ మహిళా సంక్షేమ మహా చక్రవర్తి సీఎం జగన్. చంద్రబాబు టీంకి జగనన్న గురించి మాట్లాడే అర్హత ఉందా? నారావారి నరకాసుర పాలన మహిళలందరూ గమనించారు. లోకేష్ ఎఫ్‌బీ, ఇన్‌స్టాలో మహిళలతో డాన్స్ లేశారు. లోకేష్ పీఏ మహిళలను వేధింపులకు గురి చేశారు. దేవినేని ఉమ తన పదవి కోసం వదినని చంపారు. బోండా ఉమ తల్లిని కొట్టాడు. 

టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) మహిళను బూటు కాలితో తన్నాడు. 160 సీట్లతో టీడీపీ గెలుస్తుందని అచ్చన్న జోకేశాడు’’ అని పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని డిప్యూటీ శ్రీవాణి అన్నారు. దేశంలో ఏ మహిళకు దక్కని గౌరవం ఏపీ మహిళలకు దక్కిందని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌కు మహిళలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని తెలిపారు. మహిళలను సీఎం జగన్‌ అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

కాగా, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ జరిగింది. ఈ సభాస్థలికి ఏపీ సీఎం జగన్ తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి, వెల్లంపల్లి, తానేటి వనిత, పాముల పుష్పశ్రీవాణి, నగరి ఎమ్మెల్యే రోజా, మేయర్ భాగ్యలక్ష్మి, రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పదివేలకు పైగా మహిళలు పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu