డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు: ఆర్జీవీ ట్వీట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్..

Published : Jan 09, 2023, 11:19 AM IST
డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు: ఆర్జీవీ ట్వీట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్..

సారాంశం

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. RIPRGV, కంగ్రాట్స్ జగన్ రెడ్డి అంటూ సెటైర్లు వేశారు.   

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల భేటీ‌పై ట్విట్టర్‌ వేదికగా పరోక్షంగా ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన బుద్దా వెంకన్న.. ఆర్జీవీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతాడని ఊహించలేదంటూ ఘాటు విమర్శలు చేశారు. ‘‘కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా.. కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు... RIPRGV, కంగ్రాట్స్ జగన్ రెడ్డి’’ అని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. 

ఇక,  అంతకుముందు.. ‘‘కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు .. RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు’’ అంటూ రామ్‌ గోపాల్ ట్వీట్ చేశారు. అయితే తన ట్వీట్‌లో ఎవరి పేర్లను ప్రస్తావించకపోవడం గమనార్హం. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపైనే ఆయన ఈ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ సామాజిక వర్గాన్ని ప్రస్తావించడంతో ఆయన అభిమానులు, కాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వర్మపై మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

 


ఇదిలా ఉంటే.. ఆదివారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం ఇద్దరు నేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతూ..  ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఏపీ సర్కార్ జారీ చేసిన వివాదాస్పద జీవో నెంబర్ర్ 1, పెన్షన్ లబ్ధిదారుల కోత, పాడిరైతులకు గిట్టుబాటు ధర చెల్లించకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకతను అణిచివేయడం మొదలైన వాటితో సహా పలు సమస్యలపై వారు చర్చించినట్లు నాయకులు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందని ఆరోపించారు. 

Also Read: RIP కాపులు.. కంగ్రాట్స్ కమ్మోళ్లు: ఆర్జీవీ సంచనల ట్వీట్.. మండిపడుతున్న పవన్ అభిమానులు

అయితే ఎన్నికల పొత్తులపై తర్వాత చర్చిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజకీయాల్లో పొత్తులు సహజమని.. సమీకరణాలను బట్టి పొత్తులు ఉంటాయని చెప్పారు. 2009లో టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తుపెట్టుకుందని గుర్తుచేశారు. ఆ తర్వాత విభేదించామని చెప్పారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఏ నిర్ణయాలు తీసుకునే దానిపై తమ వ్యుహాలు తమకు ఉంటాయని చెప్పారు. 

రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏం చేయాలో వివరంగా చర్చించామని కళ్యాణ్ చెప్పారు. బాధ్యతాయుతమైన పాలనను తీసుకురావడం తమ ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు. తన మిత్రపక్షమైన బీజేపీతో కూడా ఈ అంశాన్ని చర్చిస్తానని కల్యాణ్ చెప్పారు. ఇక, గతేడాది అక్టోబర్‌లో విశాఖపట్నంలో పవన్ కల్యాన్ పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. చంద్రబాబు నాయుడు ఆయనను విజయవాడలోని హోటల్‌లో కలిసి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan Health Update: చికిత్స కోసం ముంబై వెళ్లిన పవన్ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే?
Cyclone alert: బంగాళాఖాతంలో తుపాను..? ఈ జూలైలో జోరువానలు? | Heavy rains AP | Asianet News Telugu