టిడిపికి షాక్... వైఎస్సార్‌సిపిలో చేరిన బుద్దా సోదరుడు

By Arun Kumar PFirst Published Jan 8, 2019, 3:27 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్ని సమాయత్తమవుతున్నాయి. అందుకోసం ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకుని ఎన్నికలకు ముందు ప్రత్యర్థులను నైతికంగా దెబ్బతీయాలని అన్ని పార్టీలు భావిస్తున్నారు. దీంతో ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి ఈ  మధ్య జంపింగ్ లు ఎక్కువయ్యాయి. తాజాగా అధికార తెలుగు దేశం పార్టీ విప్ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వర రావు పార్టీని వీడనున్నట్లు ప్రకటించాడు. దీంతో కృష్ణా జిల్లాలో మరీ ముఖ్యంగా విజయవాడ టిడిపి కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 

శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేపడుతున్న వైఎస్సార్ సిపి అధినేత జగన్‌ను కలిసిన తర్వాత బుద్దా నాగేశ్వర రావు తన పార్టీ మార్పుపై అధికారికంగా ప్రకటనచేశారు. టిడిపి పార్టీ విధానాలు నచ్చకే వైఎస్సార్‌సిపి పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. 

తమ సోదరుడు బుద్దా వెంకన్న బిసి సమస్యలపై ఏనాడూ మాట్లాడలేదని విమర్శించారు. ఆయనతో పాటు టిడిపిలో కీలకంగా వున్న చాలామంది బిసి నేతలు కూడా  బిసిలకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారని ఆరోపించారు. ఇది నచ్చకే మరికొందరు బిసి నేతలు టిడిపి వీడి టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దంగా వున్నట్లు నాగేశ్వరరావు ప్రకటించారు.   

బిసిలకు వైఎస్సార్‌సిపి పార్టీ వల్లే న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీ అధినేత జగన్ కూడి అధికారంలోకి రాగానే బిసి సబ్ ప్లాన్ అమలు చేయడానికి సిద్దంగా వున్నానని హామీ  ఇచ్చారని....అందువల్లే ఈ పార్టీలో చేరుతున్నట్లు బుద్దా నాగేశ్వరరావు తెలిపారు. 
 
click me!