‘‘జగన్ పై ఆధ్యాత్మిక దాడికి చంద్రబాబు కుట్ర’’

Published : Jan 08, 2019, 03:18 PM IST
‘‘జగన్ పై ఆధ్యాత్మిక దాడికి చంద్రబాబు కుట్ర’’

సారాంశం

తమ అధినేత జగన్ పై ఆధ్మాత్మిక దాడి చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని వైసీపీ నేత తలశిల రఘురాం ఆరోపించారు.

తమ అధినేత జగన్ పై ఆధ్మాత్మిక దాడి చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని వైసీపీ నేత తలశిల రఘురాం ఆరోపించారు. జగన్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ఎన్నో అవరోధాలు సృష్టించిందని.. ఆఖరికి భౌతిక దాడి కూడా చేయించిందని ఆయన అన్నారు. 

అయినా వాటన్నింటనీ తట్టుకొని జగన్ తన పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారన్నారు.  ఇప్పుడు చంద్రబాబు మరో కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జగన్ పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.  బుధవారంతో జగన్ పాదయాత్ర ముగుస్తుందన్నారు.

పాదయాత్ర అనంతరం తిరుమలలో స్వామి దర్శనానికి జగన్ వెళతారని చెప్పారు. అక్కడ జగన్ పై దాడి చేయించేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని.. తమకు ఈ విషయంలో సమాచారం అందిందని తెలిపారు. స్వామివారిని కూడా రాజకీయాల అవసరాల కోసం వాడుకోవడం చంద్రబాబుకి బాగా తెలుసునని విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్