కరోనాతో మృతిచెందిన అభ్యర్థులు.. అక్కడెలా?: ఎస్ఈసిని ప్రశ్నించిన బోండా

Arun Kumar P   | Asianet News
Published : Feb 15, 2021, 04:26 PM IST
కరోనాతో మృతిచెందిన అభ్యర్థులు.. అక్కడెలా?: ఎస్ఈసిని ప్రశ్నించిన బోండా

సారాంశం

మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి చేపట్టాలని ఈసీని కోరామని... కానీ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుండే తిరిగి చేపట్టాలన్న ఎస్ఈసి నిర్ణయం నిరాశపర్చిందని టిడిపి నాయకులు బోండా ఉమ అన్నారు.

విజయవాడ: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధిస్తుందని తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమా ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి చేపట్టాలని ఈసీని కోరామని... కానీ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుండే తిరిగి చేపడుతున్నారని అన్నారు. నామినేషన్ల సమయంలో అధికార పార్టీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను మొదటినుండి చేపట్టాలని ఎస్ఈసీని కోరినట్లు ఉమా గుర్తుచేశారు. 

గతంలోతెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్లు‌ వేయకుండా భయ పెట్టారని మండిపడ్డారు. కొన్ని చోట్ల పోలీసులే నామినేషన్ పత్రాలు‌ చింపి‌వేశారన్నారు. ఇక మాచర్లలో తనతో పాటు బుద్దా వెంకన్న‌పై దాడి‌చేశారని గుర్తుచేశారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు ప్రశ్నించినందుకు తమను చంపాలని చూశారని ఆరోపించారు. ఈ అక్రమాలు, అరాచకాలను దృష్టిలో వుంచుకుని ఎస్ఈసి ఎన్నికలను మొదటినుండి చేపట్టి వుండాల్సిందన్నారు. 

read more  ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ: ఆపిన దగ్గరి నుంచే....

ఇప్పటికే పలుచోట్ల అన్యాయంగా చేసిన ఏకగ్రీవాలు పరిస్థితి ఏమిటని ఉమ ప్రశ్నించారు. కరోనా సమయంలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు కొన్ని చోట్ల మరణించారని... ఆయా స్థానాల్లో పోటీ ఎలా అనే దానిపై ఈసీ స్పష్టత ఇవ్వాలన్నారు. ఎన్నికల సంఘం ఇలాంటి వాటిపై స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు బోండా ఉమ. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్