జనవరి వరకే గడువు.. లేదంటే సంక్రాంతికి మేమే చేస్తాం: బోండా ఉమ హెచ్చరిక

Arun Kumar P   | Asianet News
Published : Nov 09, 2020, 01:07 PM IST
జనవరి వరకే గడువు.. లేదంటే సంక్రాంతికి మేమే చేస్తాం: బోండా ఉమ హెచ్చరిక

సారాంశం

గత సిఎం‌ చంద్రబాబు హయాంలో ఇళ్ల కోసం తీసుకున్న రుణాలు కూడా రద్దు చేస్తామని సీఎం జగన్ మోసం‌ చేశారని బోండా ఉమ ఆరోపించారు. 

విజయవాడ: ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసిన సమయంలో అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని... కానీ వైసిపి అధికారంలోకి వచ్చి 17నెలలైనా ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని టిడిపి నాయకులు బోండా ఉమ మండిపడ్డారు. ఇళ్లు ఇవ్వకుండా ఏరు దాటాక తెప్ప పడేసిన చందంగా వ్యవహరిస్తున్నారంటూ వైసిపి ప్రభుత్వం ఉమ విమర్శించారు. 

''గత సిఎం‌ చంద్రబాబు హయాంలో ఇళ్ల కోసం తీసుకున్న రుణాలు కూడా రద్దు చేస్తామని మోసం‌ చేశారు. జగన్ నవరత్నాలు... నవ మోసాలు గా మారిపోయాయి. చంద్రబాబు ఎనిమిది లక్షల ఇళ్లను ఆధునిక వసతులతో నిర్మించారు. రంగులు వేసి ఇచ్చే స్థాయిలో ఉన్న ఇళ్లు పేదలకు ఇవ్వడానికి జగన్ కు మనసు రావడం లేదు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల ను ఇవ్వకుండా ఆపడానికి నీకే హక్కు ఉంది'' అని నిలదీశారు. 

''లబ్ధిదారులు 25వేల నుంచి లక్ష రూపాయలు వడ్డీలకు తెచ్చి కట్టారు. నీ మాయ మాటలు నమ్మి ఓటేస్తే నయ వంచన చేశావు. జనవరి వరకు ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. ఈలోపు ఇవ్వకపోతే సంక్రాంతి నాటికి పేద వారితో మేమే గృహ ప్రవేశం చేయిస్తాం'' అని హెచ్చరించారు. 

read more  రోడ్డు ప్రమాదానికి గురయిన మంత్రులు అనిల్, మేకపాటి వాహనాలు

''17 నెలల పాలనలో ఒక్కరికి అయినా ఇల్లు కట్టించావా? సెంటు స్థలం పేరుతో స్మశానాలు, పొలాలల్లో కేటాయిస్తారా? ఐదు వేలు ఖరీదు కూడా చేయని సెంట్ స్థలం కోసం ఊరుకి దూరంగా 40కిమీ‌ వెళ్లాలా? పేదలకు సెంట్ స్థలం పేరుతో వైసిపి నేతలు నాలుగు‌వేల కోట్లు‌ దోచుకున్నారు. ఇందుకు సంబందించిన ఆధారాలు‌ చూపినా  చర్యలు తీసుకోలేదు'' అని అన్నారు. 

''ఎకరం ఇరవై లక్షలు ఉన్న‌చోట అరవై లక్షలు ప్రభుత్వ ధనాన్ని‌ చెల్లించి కాజేశారు. కొర్టులో కేసులు ఉన్నాయనే పేరుతో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చేయాలని జగన్ కుట్రలు చేస్తున్నారు. 17నెలల్లో ఏమీ‌చేయకుండా వైసిపి నేతలు ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. అసమర్ధ పాలనతో రాష్ట్రాన్ని తిరోగమనం పట్టించింది. ప్రభుత్వ‌ విధానాలకు వ్యతిరేకంగా టిడిపి పోరాటం చేస్తుంది'' అని ఉమ హెచ్చరించారు. 


 

PREV
click me!

Recommended Stories

“ఆవకాయ్ అమరావతి” Festival Announcement | Minister Kandula Durgesh Speech | Asianet News Telugu
Nara Bhuvaneshwari Launches Free Mega Medical Rampachodavaram Under NTR Trust | Asianet News Telugu