విశాఖలోని ఎన్‌సీసీ భూముల వ్యవహారంలో వైసీపీ- టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి
ఎన్నో అబద్ధాలు చెప్పి వైసీపీ (ysrcp) అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, టీడీపీ (tdp) నేత బండారు సత్యనారాయణ మూర్తి (bandaru satyanarayana murthy) . శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాము ప్రమాణం చేయడానికి సిద్ధంగా వున్నామని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి (vijayasai reddy) ఆడిటర్ అని.. టెక్నీకల్‌గా అన్ని తెలుసునని చెప్పింది. ఓసారి జీవో చదవాలని.. 2019లో మార్కెట్ వాల్యూకి 20 శాతం ఎక్కువ రేటు ప్రకారం ఇస్తామని చంద్రబాబు (chandrababu naidu) జీవో ఇచ్చారని బండారు సత్యనారాయణ మూర్తి గుర్తుచేశారు. వాళ్ళు స్టాంప్ డ్యూటీ ఎగ్జింప్షన్ అడిగారని ఆయన తెలిపారు. 64 జీవో గురించి ఎందుకు చెప్పలేదని.. అంత దమ్ము నీకు లేదంటూ బండారు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నలుగురితో కమిటీ వేసిన లెక్క ప్రకారం వెయ్యి కోట్లకు ఇవ్వాలని.. కానీ నువ్వు 187 కోట్లకు అప్పనంగా ఇచ్చేశావంటూ బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. GRPL వాళ్ళకు గజం 50 వేలు చొప్పున అమ్మలేదా నువ్వు అని ఆయన ప్రశ్నించారు. కొట్టు మురళి గంటా శ్రీనివాసరావుకు స్నేహితుడు అన్నావని.. అదే కొట్టు మురళి మీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ బ్రదర్ అని సత్యనారాయణ మూర్తి చెప్పారు. కొట్టు మురళి శ్రీరామ ప్రాపర్టీస్‌కు చెందిన రెండెకరాల స్థలంలో ఎందుకున్నావని ఆయన ప్రశ్నించారు.
undefined
ఆధాని, లూలు, పోలవరం ప్రాజెక్టులు కాన్సిల్ చేశావని.. అలాంటప్పుడు చంద్రబాబుకి దగ్గరన్న NCC కి నువ్వెందుకిచ్చావ్ అని బండారు నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, అనేక బాధ్యతలు చేపట్టాననని బండారు సత్యనారాయణ మూర్తి తెలిపారు. మచ్చ లేకుండా రాజకీయం చేశానని.. ముదపాక భూ వ్యవహారంలో మాపై లేనిపోని ఆరోపణలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లయ్యింది ఎందుకు నిరూపించలేకపోయావని సెటైర్లు వేశారు. సిట్ 2 వేశారని.. దాన్ని ఎక్కడ దాచిపెట్టారంటూ ధ్వజమెత్తారు. 16 నెలలపాటు జైలులో ఉన్నావని.. జగన్ లాంటి చరిత్ర మాకెవరికి లేదంటూ బండారు వ్యాఖ్యానించారు. నీ బాగోతం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని.. జీవోలతో తిరుపతి వెంకన్న దగ్గరకురా... ప్రమాణం చేద్దామంటూ మాజీ మంత్రి సవాల్ విసిరారు.
నువ్వు చేసిన అక్రమాలు బయటపెడితే మా అంతు చూస్తావా .. చంద్రబాబు చిరకాలం జీవిస్తారని బండారు స్పష్టం చేశారు. మీరున్న జైలుకి చంద్రబాబు సీఎం హోదాలో వచ్చి మీకు ముద్ద వేస్తారంటూ బండారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. షెల్ కంపెనీ GRPL నుంచి కొన్న భూమి కొంటె నష్టపోతారని హితవు పలికారు. నామీద కేసు పెడితే, తాను ముదపాక వ్యవహారంలో మీపై కేసు పెడతానని సత్యనారాయణ మూర్తి హెచ్చరించారు.