అందరికీ తెలిసిందేగా ''రసికులం''..: అంబటిపై అయ్యన్నపాత్రుడు సెటైర్లు

By Arun Kumar P  |  First Published Oct 29, 2023, 1:41 PM IST

టిడిపి నిరసన కార్యక్రమంతో పాటు తనపై జరిగిన దాడిపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబుకు టిడిపి నేత అయ్యన్నపాత్రుడు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 


అమరావతి : సాధారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ సాగుతుంటాయి... టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఇవి మరింత ముదిరాయి. అధికార వైసిపి నాయకులు చంద్రబాబు అవినీతిపరుడని... తప్పుచేసాడు కాబట్టే అరెస్ట్ చేసామని అంటోంది. టిడిపి మాత్రం ఈ అరెస్ట్ రాజకీయ కక్షసాధింపులో భాగమేనని అంటున్నారు. ఇలా ఇరుపార్టీల నాయకుల మధ్య సాగుతున్న మాటలయుద్దం వ్యక్తిగత దూషణలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ(ఆదివారం) 'కళ్లు తెరిపిద్దాం' పేరిట నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వగా... ఈ విషయంలో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మధ్య సోషల్ మీడియాలో మాటలయుద్దం సాగుతోంది. 

''ఇన్నాళ్లూ ప్రజలకళ్ళకి గంతలు కట్టారు. ఇప్పుడు మీరే కట్టుకుంటున్నారు. విధి.....విధి......... విచిత్రమైనది !'' అంటూ టిడిపి పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమంపై సెటైర్లు వేసారు. ఎక్స్(ట్విట్టర్) వేదికన అంబటి చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి అయ్యన్న ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 

Latest Videos

''అధికార మదంతో వచ్చిన అహంకారం అనే గంతలతో మీకు నిజం తెలియడం లేదు. మీరు కళ్ళు తెరిచి చూసేసరికి మీ చీటీ చినిగిపోతుంది... మీ సినిమా ముగిసిపోయింది. విధి చిద్విలాసం అంటే అప్పుడు తెలుస్తుంది'' అంటూ అంబటికి కౌంటర్ ఇచ్చారు అయ్యన్నపాత్రుడు. 

Read More  వేసేస్తామంటూ వార్నింగ్, అందరిదీ ఒకే సామాజిక వర్గం .. దాడి చేస్తే చేతులు కట్టుకుని కూర్చోం : అంబటి రాంబాబు

ఇక తెలంగాణలోని ఖమ్మంలో మంత్రి అంబటిపై జరిగిన దాడిపైనా ఇరువురు నేతలమద్య సోషల్ మీడియాలో వాగ్వాదం జరిగింది. ''కులోన్మాదంతో దాడి చేయాలనుకుంటే నాకూ ఒక కులం ఉంది, గుర్తుపెట్టుకోండి !'' అంటూ తనపై దాడి చేసినవారిని హెచ్చరించారు అంబటి. ఈ ట్వీట్ పై అయ్యన్న స్పందిస్తూ ''అందరికీ తెలిసిందేగా "రసికులం"..'' అంటూ సెటైర్లు వేసారు. 

నేడు టిడిపి నిరసన : 

 చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలను వ్యతిరేకిస్తూ వైసిపి ప్రభుత్వంపై మరో నిరసనకు సిద్దమయ్యింది టిడిపి.అక్టోబర్ 29న అంటే ఇవాళ రాత్రి 7గంటల నుండి 7.05 నిమిషాల వరకు జగనాసుర చీకటి పాలనకు వ్యతిరేకంగా వినూత్న నిరసనకు టిడిపి పిలుపునిచ్చింది. ఐదు నిమిషాల పాటు కళ్లకు గంతలు కట్టుకుని ఇళ్లనుండి బయటకురావాలని... వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా 'నిజం గెలవాలి' అంటూ గట్టిగా నినదించాలని సూచించారు. ఇలా చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని టిడిపి పిలుపునిచ్చింది. 

click me!