గన్నేరు పప్పు అండ్ గబ్బుకి ఇదే నా సవాల్: అయ్యన్నపాత్రుడు

By Arun Kumar PFirst Published Mar 15, 2021, 2:02 PM IST
Highlights

మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై సీఎం జగన్ కు నమ్మకముంటే వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెన్నక్కితీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అయ్యన్న సూచించారు.  

విశాఖపట్నం: మున్సిపల్ మరియు కార్పోరేషన్ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న వైసిపికి, ముఖ్యమంత్రి జగన్ కు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. ఈ విజయంపై నమ్మకముంటే వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెన్నక్కితీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అయ్యన్న సూచించారు.  

''గన్నేరు పప్పు అండ్ గబ్బు కి చిన్న సవాల్.మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బలుపు కాదు గెలుపు అనే నమ్మకం ఉంటే,ప్రజాస్వామ్యబద్దంగా గెలిచాం అనే ధైర్యం ఉంటే,అధికార దుర్వినియోగం చెయ్యకుండా విజయం సాధించామని చెప్పే దమ్ము ఉంటే 151 మంది ఎమ్మెల్యేలు, 28 మంది ఎంపీలతో రాజీనామా చేయించి మోదీ మెడలు వంచండి. విశాఖ ఉక్కు అమ్మకుండా అడ్డుకోండి. అన్నీ గెలిచాం అని కాలర్ ఎగరేసే గన్నేరు పప్పు రాజీనామా అనగానే ఎందుకు పిరికివాడిలా ఇంటికే పరిమితమవుతున్నాడు 'గబ్బు'?'' అంటూ ట్విట్టర్ వేదికన విమర్శించారు. 

''మోదీ ని చూసి వణుకుతూ తాడేపల్లి కొంపలో తొంగున్న గన్నేరు పప్పు ప్రత్యేక హోదాని ఎలాగో అటకెక్కించాడు కనీసం విశాఖ ఉక్కు కోసమైనా రాజీనామా చేయించు. విజయం వెనుక ఉన్న వణుకు బయటపడుతుంది'' అని అయ్యన్న విరుచుకుపడ్డారు. 

అంతకుముందు ''కేసుల మాఫీ కోసం ఢిల్లీ పెద్దల పాదాల‌పై ప‌డినా జగన్ డెకాయిట్ గ్యాంగ్‌ని క‌రుణించ‌లేదు. ప్ర‌త్యేక‌హోదా, రైల్వేజోన్‌, విభ‌జ‌న హామీలన్నీ వ‌దులుకున్నా నిన్నొద‌ల జ‌గ‌నాలు అంటున్నాయి చేసిన పాపాలు. దీంతో కరుడుగట్టిన పేటీఎం బ్యాచ్ కూడా గన్నేరు పప్పు జగ్గడి తీరు చూసి అసహ్యించుకుంటున్నారు'' అని మండిపడ్డారు.  

''టిడిపి హయాంలోనే డిక్షన్ రెండో దశ విస్తరణ పూర్తి చేసుకొని ఉత్పత్తి పూర్తిస్థాయిలో ప్రారంభించింది.అబద్ధాల సాక్షిలో ఎంత డప్పు కొట్టినా గూగుల్ వదిలిపెట్టదు గా డిక్షన్ అని కొట్టగానే చరిత్ర మొత్తం వచ్చేసింది'' అని అయ్యన్న అన్నారు. 
 

click me!