'బోసడీకే'... ఆ మాటకు తెలంగాణ పదకోశంలో అర్ధం ఇదే: అయ్యన్నపాత్రుడు

By Siva KodatiFirst Published Oct 24, 2021, 4:47 PM IST
Highlights

సానుభూతి వస్తుందని అనుకుంటే తనపై తానే ఉమ్మేసుకునే రకం వైఎస్ జగన్ అని విమర్శించారు. ఓట్లు, సీట్లు వస్తాయని తండ్రి, బాబాయిల శవాల దగ్గర్నుంచి, కోడికత్తి వరకు దేన్నీ వదలని జగన్ 'బోసిడికె' అన్న పదాన్ని వదులుతాడా? అని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (Ys jagan) టీడీపీ (tdp) నేత కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy pattabhi) చేసిన వ్యాఖ్యలు ఎంతటి కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానంగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ 'బోసడీకే'... అన్నపదం ఏపీలో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైంది. టీడీపీ నేత పట్టాభి (kommareddy pattabhi) గత మంగళవారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్‌ని ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాతనే వైసీపీ కేడర్ భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై అధికార పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడటం తెలిసిందే. అయితే అసలు 'బోసడీకే' అంటే అర్థం తెలియక చాలా మంది తలలు పట్టుకుంటున్నారు. అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం నెట్టింట్లో జల్లెడపడుతున్నారు.

దీనిని వైసీపీ నేతలు బూతు అంటే.. టీడీపీ నేతలేమో కాదు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (ayyanna patrudu) స్పందించారు. సానుభూతి వస్తుందని అనుకుంటే తనపై తానే ఉమ్మేసుకునే రకం వైఎస్ జగన్ అని విమర్శించారు. ఓట్లు, సీట్లు వస్తాయని తండ్రి, బాబాయిల శవాల దగ్గర్నుంచి, కోడికత్తి వరకు దేన్నీ వదలని జగన్ 'బోసిడికె' అన్న పదాన్ని వదులుతాడా? అని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ పదకోశంలో 'బోసిడికె' అంటే 'పాడైపోయిన' అని అర్థం అని ఆయన వివరించారు.

ALso Read:'బోసడీకే'... ఆ మాటకు తెలంగాణ పదకోశంలో అర్ధం ఇదే: అయ్యన్నపాత్రుడు

సలహాల సజ్జలను (sajjala rama krishna reddy) 'బోసిడికె' అంటే, సానుభూతి కోసం ఎంతకైనా దిగజారే జగన్ అది తననే అన్నారని అన్వయించుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. 'బోసిడి'కె పదానికి పెడర్థాలు తీసి తల్లిపేరుతో కొత్త సెంటిమెంట్ కార్డు బయటికి తీశాడని విమర్శించారు. "తల్లిపై నిజంగా ప్రేమే ఉంటే... తల్లిని బూతులు తిట్టినవారికి మంత్రి పదవి ఇవ్వడని, తల్లిని చెల్లిని అలా తెలంగాణ రోడ్లపై అనాథలుగా వదిలేయడు" అని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు.

కాగా.. ఇదే పదంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ (raghu rama krishnam raju) సైతం గతవారం స్పందించారు. పట్టాభి ఏమన్నారు అనేది తాను చూశానని.. బోసడీకే అనేది హిందీ పదం అనుకుంటా అని రఘురామ అభిప్రాయపడ్డారు. ఈ పదానికి అర్థం ఏమిటని నేనే నా స్నేహితులు ఇరవై, పాతిక మందిని అడిగానని.... వైసీపీలోని అజ్ఞాత మిత్రులను కూడా అడిగాని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. వారంతా కూడా మాకు తెలియదు... బూతు పదమేమో అని చెప్పారని ఆయన గుర్తుచేశారు. దీంతో తాను గూగుల్‌లో వెతికానని... అందులో చాలా స్పష్టంగా  'సర్... మీరు బాగున్నారా' అని వుందన్నారు.  సంస్కృతంలో బోసడీకే అనే పదానికి అర్థం' అది అని రఘురామ వివరించారు. 

click me!