జగన్ పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేసిన టీడీపీ: విధ్వంస పాలన ప్రారంభమై మూడేళ్లు గడుస్తుందన్న అచ్చెన్నాయుడు

Published : May 30, 2022, 05:25 PM ISTUpdated : May 30, 2022, 07:19 PM IST
జగన్ పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేసిన టీడీపీ: విధ్వంస పాలన ప్రారంభమై మూడేళ్లు గడుస్తుందన్న అచ్చెన్నాయుడు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మూడేళ్ల పాలనలో 1,116 అక్రమాల పేరుతో టీడీపీ చార్జ్ షీట్ విడుదల చేసింది. ఆంద్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  ఈ చార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మూడేళ్ల పాలనలో 1,116 అక్రమాల పేరుతో టీడీపీ చార్జ్ షీట్ విడుదల చేసింది. ఆంద్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  ఈ చార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంస, దుర్మార్గ పాలన ప్రారంభమై మూడేళ్లు గడుస్తుందన్నారు. రివర్స్ టెండరింగ్ విధానం ఏపీని తిరోగమనంలోకి నెట్టేసిందని విమర్శించారు. నీటి పారుదల ప్రాజెక్టులను నాశనం చేశారని మండిపడ్డారు. మూడేళ్ల జగన్ పాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. 

జగన్‌ది విధ్వంసకర పాలన అని విమర్శించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని, జగన్ పాలనలో ప్రజలను ముప్పుతిప్పలు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనకు నాంది పలికారని చెప్పారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై రూ.46 వేల కోట్ల విద్యుత్ భారం మోపుతున్నారని ఆరోపించారు. చార్జీలు పెరిగినా కరెంట్ కోతలు తప్పడం లేదన్నారు.

చెత్తపై కూడా పన్ను వేస్తున్నారని విమర్శించారు. గడప గడపకు వస్తున్న వైసీపీ నేతలను ప్రజలు నిలదీస్తుండటంతో.. మంత్రులు బస్సు యాత్ర చేపట్టారని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డిజీల్ ధరలపై అధికర ధరలు ఏపీలోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలను జగన్ ప్రభుత్వం వీరబాదుడు బాదేస్తోందన్నారు. గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించారని అన్నారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రతో ఎవరికి లాభం అని ప్రశ్నించారు. బీసీ మంత్రులు నోరు లేని మూగ జీవులు అని అన్నారు. కార్పొరేషన్లతో ఒక్కరికి ప్రయోజనం చేకూరిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాలు విసిరారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం