దేవాదాయ శాఖ మంత్రి నోటి నుంచి బూతులా: వెల్లంపల్లికి అశోక్ కౌంటర్

Siva Kodati |  
Published : Jan 03, 2021, 08:24 PM IST
దేవాదాయ శాఖ మంత్రి నోటి నుంచి బూతులా: వెల్లంపల్లికి అశోక్ కౌంటర్

సారాంశం

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటరిచ్చారు టీడీపీ నేత అశోక్ గజపతి రాజు. దేవాదాయ శాఖ మంత్రి నుంచి బూతులు రావడం ఆయన సంస్కారానికి నిదర్శనమన్నారు. 

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటరిచ్చారు టీడీపీ నేత అశోక్ గజపతి రాజు. దేవాదాయ శాఖ మంత్రి నుంచి బూతులు రావడం ఆయన సంస్కారానికి నిదర్శనమన్నారు.

చంద్రబాబు నాయుడు రామతీర్ధం వచ్చిన రోజే విజయసాయిరెడ్డికి పనేంటనీ గజపతి ఎద్దేవా చేశారు. ఛైర్మన్ బాధ్యతల నుంచి తనను తప్పించిన ప్రభుత్వం.. దేవాదాయ శాఖ వైఫల్యాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అశోక్ ప్రశ్నించారు. జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి ప్రస్తుతం బెయిల్‌పై తిరుగుతున్నాడని ఆయన మండిపడ్డారు. 

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వీటిని నిరసిస్తూ విజయనగరంలో వినూత్న నిరసనకు దిగాయి టీడీపీ శ్రేణులు.

అశోశ్ బంగ్లా నుంచి మయూరి జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ కొబ్బరి చిప్పలు, శెనగలు పట్టుకుని మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దేవాలయాలకు రక్షణ కల్పించలేని వెల్లంపల్లి.. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మయూరి జంక్షన్‌లో మావన హారంగా ఏర్పడి.. మంత్రి వెల్లంపల్లి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 

అంతకుముందు ఆదివారం రామతీర్థం అలయాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఘటనపై అర్చకులు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీని వెనుక టీడీపీ నేతల హస్తముందని మంత్రులు ఆరోపించారు.

దేవుడితో పెట్టుకున్న చంద్రబాబుకు తగిన శాస్తి జరుగుతుందని బొత్స తీవ్రవ్యాఖ్యలు చేశారు. నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఎవర్నీ వదిలి పెట్టమని హెచ్చరించారు. చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu