‘‘ప్రజా రాజ్యంను కాంగ్రెస్ లో కలిపింది ఆయనే’’

Published : Jan 07, 2019, 09:44 AM IST
‘‘ప్రజా రాజ్యంను కాంగ్రెస్ లో కలిపింది ఆయనే’’

సారాంశం

 మెగాస్టార్ చిరంజీవి.. ప్రజారాజ్యం పేరిట పార్టీని స్థాపించి.. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

 మెగాస్టార్ చిరంజీవి.. ప్రజారాజ్యం పేరిట పార్టీని స్థాపించి.. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే.  అయితే.. చంద్రబాబు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కారణం మాజీ మంత్రి రామచంద్రయ్యేనట.  రామచంద్రయ్య కారణంగానే కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేశారని.. టీడీపీ నేత ఆరీఫుల్లా ఆరోపించారు.

ఆరిఫుల్లా.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రామచంద్రయ్యపై విమర్శలు చేశారు. ఆయనకు అధికారదాహం ఎక్కువ అని ఆరోపించారు. అప్పుడు  ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయించారని, ప్రస్తుతం మోదీ మార్గదర్శకత్వంలో వైసీపీలో చేరి ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసే దిశగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

అందుకు ప్రతిఫలంగా బీజేపీ రాజ్యసభ కుర్చీని ఆఫర్‌ ఇచ్చినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రామచంద్రయ్యకు రాజకీయ గుర్తింపు ఉందంటే అది చంద్రబాబు చలువేనన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముక్తియార్‌, రాజగోపాల్‌, షామీర్‌బాష, సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్