తల్లితో సహజీవనం చేస్తూ... కుమార్తెను వివస్త్రను చేసి, చిత్రహింసలు

sivanagaprasad kodati |  
Published : Jan 07, 2019, 07:56 AM IST
తల్లితో సహజీవనం చేస్తూ... కుమార్తెను వివస్త్రను చేసి, చిత్రహింసలు

సారాంశం

సుఖానికి అలవాటు పడి ప్రియుడి మోజులో కడుపున పుట్టిన బిడ్డకు నరకం చూపిస్తోంది ఓ తల్లి. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లాకు చెందిన ఓ మహిళకు భర్త చనిపోయాడు. ఆమెకు 11 ఏళ్ల కూతురు ఉంది

సుఖానికి అలవాటు పడి ప్రియుడి మోజులో కడుపున పుట్టిన బిడ్డకు నరకం చూపిస్తోంది ఓ తల్లి. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లాకు చెందిన ఓ మహిళకు భర్త చనిపోయాడు. ఆమెకు 11 ఏళ్ల కూతురు ఉంది...

ఈ క్రమంలో సదరు మహిళ తన ఇంటికి దగ్గర్లో ఉండే ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కుమార్తె డబ్బు దొంగలిస్తోందని, సక్రమంగా చదవడం లేదని ఆరోపిస్తూ తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి తరచు ఆ బాలికను కొడుతూ ఉండేవాడు.

శనివారం రాత్రి కూడా మద్యం మత్తులో బాలికను కర్రతో చితకబాది.. వివస్త్రను చేసి గదిలో పెట్టి తాళం వేశాడు.. అడ్డుకోవాల్సిన తల్లి సైతం ప్రియుడికే సహకరించింది. రెండు రోజులుగా ఆహారం పెట్టుకపోవడంతో చిన్నారి నీరసించిపోయింది.

తలపై గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమైంది.. పాప పరిస్థితిని గమనించిన కొందరు స్థానికులు చైల్డ్ లైన్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులతో సహా ఘటనాస్థలికి చేరుకున్నారు.

బాలిక పరిస్థితిని చూసి చలించిపోయిన వారు ఆమెను విడిపించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయాల ధాటికి బాలిక కనీసం కూర్చోలేని స్థితికి చేరుకుంది.. 8 నెలలుగా చిత్రహింసలకు గురిచేస్తూ తనను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు చిన్నారి చైల్డ్‌లైన్ ప్రతినిధులకు తెలిపింది. బాలికను హింసించిన తల్లి, ఆమె ప్రియుడిపై పోలీసులు హత్యాయత్నం, ఫోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్