తెలుగుదేశం, జనసేన పార్టీలు తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. రెండో జాబితా కోసం రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
అమరావతి: తెలుగుదేశం, జనసేన కూటమి రెండో జాబితా విడుదలకు కసరత్తు చేస్తున్నాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన తెలుగుదేశం-జనసేన తొలి జాబితాను విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ 94 మంది, జనసేన ఐదు మంది అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు 24 అసెంబ్లీ, మూడు ఎంపీ స్థానాలను కేటాయించింది టీడీపీ.24 స్థానాల్లో కేవలం ఐదుగురు అభ్యర్థులనే జనసేన ప్రకటించింది.
also read:లాస్య నందిత మృతి:పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు, టిప్పర్ గుర్తింపు
undefined
టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందనే ప్రచారం సాగుతుంది.ఈ విషయమై ఈ వారంలో బీజేపీ అధిష్టానం నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. పొత్తుల విషయమై బీజేపీ నాయకత్వం ఏం చెబుతుందనే విషయమై ఈ రెండు పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు.
ఈ వారం లోపుగా రెండో జాబితాను విడుదల చేయాలని తెలుగుదేశం, జనసేన భావిస్తుంది. తెలుగుదేశం పార్టీ 20 నుండి 25 స్థానాలను, జనసేన పది నుండి 12 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
also read:రోడ్డు పక్క టీ తాగిన బిల్ గేట్స్: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
తెలుగుదేశం, జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే విషయమై స్పష్టత వచ్చిన తర్వాత మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఉండనుంది.
తెలుగుదేశం పార్టీ సీనియర్లకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. అయితే రెండో జాబితాలో సీనియర్లకు చోటు దక్కనుందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. మరోవైపు తొలి జాబితాలో చోటు దక్కని సామాజిక వర్గాలకు రెండో జాబితాలో ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ
also read:ప్రాజెక్టుల బాట: మేడిగడ్డకు బీఆర్ఎస్, కౌంటర్‌గా పాలమూరుకు కాంగ్రెస్
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దరిమిలా ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్దమౌతున్నాయి. ఈ దఫా కూడ వైఎస్ఆర్‌సీపీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం)లు కూటమిగా పోటీ చేసే అవకాశం ఉంది.