టీడీపీ-జ‌న‌సేన: ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ

By Mahesh RajamoniFirst Published Nov 10, 2023, 3:31 AM IST
Highlights

TDP-Jana Sena alliance: జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, దీనిపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌ డిమాండ్‌ చేశారు. పశువుల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున జరిగిన అవకతవకలను ఇంతకుముందు స్పష్టంగా వివరించామన్నారు. 
 

Amaravati: సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించడానికి టీడీపీ-జనసేన కూటమి త్వరలో ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తుందనీ, నవంబర్ 17 నుంచి 'భవిష్యతు భరోసా' కార్యక్రమంలో పాల్గొంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు తెలిపారు. నవంబ ర్ 9న ఇక్కడ జరిగిన రెండు పార్టీల రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అచ్చెన్నాయుడు మీడియాకు వివరిస్తూ ఇకపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు రెండు పార్టీలు సమిష్టిగా కృషి చేస్తాయని చెప్పారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి అనంతరం కరువు ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు.

పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం బీమా, తగిన పరిహారం అందించే వరకు పోరాడాలని టీడీపీ, జనసేన తీర్మానించాయి. ఇకపై ప్రతి పక్షం రోజులకోసారి మంగళగిరి సమీపంలోని టీడీపీ లేదా జనసేన కార్యాలయంలో రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఆరు అంశాలపై జనసేన దృష్టి సారించాలని కోరిందని, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సాధారణ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కూటమి మరింత ఉత్సాహంగా తమ ప్రచారాన్ని నిర్వహిస్తుందని అచ్చెన్నాయుడు చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. మేనిఫెస్టో కమిటీలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు టీడీపీకి చెందిన మరో ఇద్దరు ఉంటారు.

రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని, పెంచిన విద్యుత్ ఛార్జీలతో ప్రజలపై మోపుతున్న భారం, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడం, వైసీపీ అండదండలతో మాఫియా ఇసుకను దోచుకోవడాన్ని ఎండగడతామని అచ్చెన్నాయుడు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో, ప్రస్తుత ప్రభుత్వం వారిని ఓటు బ్యాంకుగా ఎలా వాడుకుంటోందో అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహించనున్నారు. టీడీపీ నేతలు నారా లోకేశ్, రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, పయ్యావుల కేశవ్, జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లు ఈ స‌మ‌వేశాల్లో పాల్గొన్నారు.

click me!