15 రోజులకు ఓ సమస్యపై ఉద్యమం: టీడీపీ-జనసేన జేఏసీ సమావేశంలో కీలక నిర్ణయం

Published : Nov 09, 2023, 03:29 PM ISTUpdated : Nov 09, 2023, 03:31 PM IST
15 రోజులకు ఓ సమస్యపై ఉద్యమం: టీడీపీ-జనసేన జేఏసీ సమావేశంలో కీలక నిర్ణయం

సారాంశం

వైఎస్ జగన్ సర్కార్ పై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని  టీడీపీ-జనసేన జేఏసీ సమావేశం  నిర్ణయం తీసుకుంది.    

విజయవాడ:జగన్ సర్కార్ పై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని  ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది.గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు  రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.తెలుగుదేశం, జనసేన జేఏసీ సమావేశం గురువారంనాడు విజయవాడలో నిర్వహించారు.ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రెండు పార్టీల నేతలు  మీడియాకు వివరించారు. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు, జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్  నాదెండ్ల మనోహర్ లు మీడియాకు వివరించారు.

ఈ నెల  17 నుండి టీడీపీ, జనసేనలు సంయుక్తంగా భవిష్యత్తుకు గ్యారెంటీ స్కీమ్ లో పాల్గొనాలని డిసైడ్ చేశారు. రెండు పార్టీలు సంయుక్తంగా  మేనిఫెస్టోను రూపొందించాలని నిర్ణయించారు.మరోవైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులపై కూడ ఈ సమావేశంలో తీర్మానం చేశారు.

ఇందులో భాగంగా   రెండు పార్టీలకు చెందిన ముగ్గురేసి నేతలతో  మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలోని  175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు  టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని  టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.నియోజకవర్గాల వారీగా ప్రణాళికల తయారీకి నిర్ణయం తీసుకున్నామన్నారు.ఏ నియోజకవర్గంలో ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించే విషయమై రెండు రోజుల్లో  తమ ప్లాన్ ను విడుదల చేయనున్నామని  అచ్చెన్నాయుడు చెప్పారు.

మేనిఫెస్టో కమిటీలో టీడీపీ తరపున యనమల రామకృష్ణుడుతో పాటు మరో ఇద్దరు సభ్యులుంటారన్నారు. మేనిఫెస్టోపై  ఈ నెల  13న సమావేశం ఏర్పాటు చేసినట్టుగా  అచ్చెన్నాయుడు తెలిపారు.మేనిఫెస్టోలో  జనసేన ఇచ్చిన నాలుగైదు అంశాలను కూడ చేర్చే విషయాన్ని పరిశీలిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.రాష్ట్రంలో నెలకొన్న కరువుపై ఉమ్మడి కార్యాచరణను అమలు చేయాలన్నారు. రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవరకూ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నామని  నాదెండ్ల మనోహర్ చెప్పారు. రోడ్లు,మద్యం,విద్యుత్ చార్జీల పెంపు,ఇసుక పై పోరాటాలు చేస్తామన్నారు. 

ప్రతి 15 రోజులకు ఒక సమస్యపై ఉద్యమం చేయాలని నిర్ణయం తీసుకోనున్నట్టుగా  ఆయన చెప్పారు. బీసీలపై దాడులకు నిరసనగా కార్యక్రమాలు నిర్వహిస్తామని  రెండు పార్టీల నేతలు చెప్పారు.ఓటర్ జాబితాలో అక్రమాలపై కలిసి పనిచేయాలని నిర్ణయించారు. టీడీపీ-జనసేన నాయకులపై పెట్టిన కేసులపై న్యాయపరంగా పోరాటాలు చేస్తామని నేతలు తెలిపారు.

ఈ దుర్భర పరిస్థితుల్లో కరవు మండలాలు గుర్తించి ప్రకటించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఈ తీర్మానం అభిప్రాయపడింది. నిబంధనల మేరకు కరవును లెక్కిస్తే 449 మండలాలను ప్రకటించాల్సి ఉంది. కేవలం 103 మండలాలనే కరవు మండలాలుగా గుర్తించడం రైతులను మోసగించడమేనని  ఈ సమావేశం అభిప్రాయపడింది. నష్టపోయిన రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ రూపంలో పంట నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. కరవు మండలాల్లో పర్యటించి రైతులకు అందాల్సిన సాయం సక్రమంగా చేరేలా పోరాడాలని తీర్మానం చేసిన విషయాన్ని  నేతలు మీడియా సమావేశంలో వివరించారు.

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu