టీడీపీకి షాకిచ్చిన నేత‌

Published : Aug 17, 2017, 05:24 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
టీడీపీకి షాకిచ్చిన నేత‌

సారాంశం

జ్యోతుల చంటిబాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలోకి జ్యోతుల నెహ్రు పునరాగమనంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం. తన తండ్రి మరణించిన పార్టీ నుండి ఒక్కరు కూడా రాలేదని అవేధన వ్యక్తం చేసిన జ్యోతుల

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఆ పార్టీ నేత షాకిచ్చారు. జగ్గంపేట టీడీపీ నియోజకవర్గ నాయకుడు జ్యోతుల చంటిబాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ సభ్యత్వానికి, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ పదవికి ఆయన రాజీనామా చేశారు. భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించేందుకు తన మద్దతుదారులతో ఆయన మంతనాలు జరుపుతున్నారు.


వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ కారణంగా పార్టీలో చంటిబాబు ఇమడలేకపోయారని తెలుస్తోంది. టీడీపీలోకి జ్యోతుల నెహ్రు పునరాగమనంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పార్టీ అధినేత చంద్రబాబు గత కొంతకాలంగా త‌న‌ని పట్టించుకోకపోవడంతో కొంత‌ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తన తండ్రి చనిపోయినా టీడీపీ నేతలెవరూ కనీసం సానుభూతి తెలపకపోవడం ఆయనను ఆవేదనకు గురిచేసిందని తెల‌సుస్తుంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఏ పార్టీతో క‌ల‌సి పోవాలి అనే విష‌యం పై త‌మ మ‌ద్ద‌తుదారుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెల‌స్తుంది. మ‌రోవైపు టీడీపీ యంత్రాంగం కూడా ఆయ‌న‌ను బుజ్జ‌గించే ప‌నిలో ప‌డంది.
 

PREV
click me!

Recommended Stories

Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు
YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై వైఎస్ జగన్ పంచ్ లు| Asianet News Telugu