టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లాక్ డౌన్ సమయంలో 20 కిలోలు తగ్గారు.లాక్ డౌన్ సమయాన్ని లోకేష్ బరువు తగ్గించుకొనేందుకు ఉపయోగించుకొన్నాడు.
అమరావతి:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లాక్ డౌన్ సమయంలో 20 కిలోలు తగ్గారు.లాక్ డౌన్ సమయాన్ని లోకేష్ బరువు తగ్గించుకొనేందుకు ఉపయోగించుకొన్నాడు.
మహానాడుకు హాజరైన లోకేష్ ను పలువురు నేతలు బరువు తగ్గడంపై ఆరా తీశారు. తాను ఎలా బరువు తగ్గారో పార్టీ నేతలకు ఆయన వివరించారు.
లాక్ డౌన్ కు ముందే చంద్రబాబునాయుడు, లోకేష్ లు హైద్రాబాద్ కు వచ్చారు. లాక్ డౌన్ విధించడంతో వారిద్దరూ హైద్రాబాద్ లోనే ఉండిపోయారు. లాక్ డౌన్ సమయంలో లోకేష్ బరువు తగ్గేందుకు శ్రమించారు.ప్రతి రోజూ 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడంతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా 20 కిలోలు తగ్గినట్టుగా లోకేష్ పార్టీ నేతలకు వివరించారు.
నైక్ ట్రైనింగ్ క్లబ్ అనే మొబైల్ యాప్ లో సూచించిన విధంగా వ్యాయామం చేసినట్టుగా ఆయన చెప్పారు. చెన్నైకి చెందిన ఒక డైటీషీయన్ సూచనలను కూడ ఆయన పాటించారు.
also read:జగన్ ప్రభుత్వం ఐదేళ్లు ఉండదు, మేం వస్తాం: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
మూడు రోజుల క్రితం చంద్రబాబు, లోకేష్ లు హైద్రాబాద్ నుండి నేరుగా అమరావతికి చేరుకొన్నారు. లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో ఈ ఇద్దరూ నేతలు అమరావతికి వచ్చారు.
రెండు రోజులుగా టీడీపీ మహనాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో వీడియో కాన్పరెన్స్ ద్వారానే మహానాడులో నేతలు పాల్గొంటున్నారు.