గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి చేరేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం తాడేపల్లిలో సీఎం జగన్ నివాసంలో వంశీ భేటీ అయ్యారు. అర్థగంటకు పైగా సాగిన భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. పార్టీ మారే అంశాన్ని జగన్ వద్ద ప్రస్తావించారు వంశీ.
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి చేరేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం తాడేపల్లిలో సీఎం జగన్ నివాసంలో వంశీ భేటీ అయ్యారు. అర్థగంటకు పైగా సాగిన భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. పార్టీ మారే అంశాన్ని జగన్ వద్ద ప్రస్తావించారు వంశీ.
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు వంశీ అంగీకారం తెలపడంతో వల్లభనేని చేరికకు జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీపావళి తర్వాత పార్టీకి, ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆయనతో పాటు మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం తమతో టచ్‌లో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ పరిణామాలపై వంశీ క్లారిటీ ఇస్తనే తాము స్పందిస్తామంటూ టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read:జగన్‌తో వంశీ భేటీ ఎఫెక్ట్: అజ్ఙాతంలోకి యార్లగడ్డ వెంకట్రావ్
జగన్మోహన్ రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలవడంతో కృష్ణాజిల్లాలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. వంశీ ప్రత్యర్ధి అయిన యార్లగడ్డ వెంకట్రావు ఈ పరిణామంతో కలత చెందినట్లుగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రి జగన్‌ని శుక్రవారం కలిసిన వంశీ సుమారు అర్థగంటపాటు మంతనాలు జరిపారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో వంశీ గనుక వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకుంటే తన రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని యార్లగడ్డ మదనపడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎంను వల్లభనేని కలవబోతున్నారన్న వార్త గుప్పుమనగానే వెంకట్రావ్ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారని టాక్.
వల్లభనేని వంశీపై ఇటీవలనే కేసు నమోదైంది. నకిలీ ఇళ్ల పట్టాలను ఇచ్చారని వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. గత ప్రభుత్వ హాయంలో ఇళ్ల పట్టాల కోసం ఇచ్చిన స్థలంలోనే పట్టాలు ఇచ్చినట్టుగా వంశీ సీఎం జగన్ కు వివరణ ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయంలో తన ప్రమేయం లేదన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై కేసు పెట్టారని వంశీ వివరణ ఇచ్చారని సమాచారం.
Also Read:ఇద్దరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్: జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ వెనుక నాని
ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్నినానితో కలిసి వంశీ జగన్ నివాసానికి చేరుకొన్నారు.రెండు రోజుల క్రితం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. ఆ తర్వాత వంశీ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్టుగా సమాచారం.
పార్టీ మార్పు విషయమై వంశీ తన అనుచరులతో చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం విషయమై ఇంకా స్పష్టత రాలేదు.అయితే పార్టీ మార్పు విషయమై వల్లభనేని వంశీ గురువారం నాడే స్పష్టత ఇచ్చారు.