జగన్‌తో వంశీ భేటీ ఎఫెక్ట్: అజ్ఙాతంలోకి యార్లగడ్డ వెంకట్రావ్

By sivanagaprasad Kodati  |  First Published Oct 25, 2019, 8:06 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలవడంతో కృష్ణాజిల్లాలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. వంశీ ప్రత్యర్ధి అయిన యార్లగడ్డ వెంకట్రావు ఈ పరిణామంతో కలత చెందినట్లుగా తెలుస్తోంది


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలవడంతో కృష్ణాజిల్లాలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. వంశీ ప్రత్యర్ధి అయిన యార్లగడ్డ వెంకట్రావు ఈ పరిణామంతో కలత చెందినట్లుగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి జగన్‌ని శుక్రవారం కలిసిన వంశీ సుమారు అర్థగంటపాటు మంతనాలు జరిపారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది.

Latest Videos

ఈ నేపథ్యంలో వంశీ గనుక వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకుంటే తన రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని యార్లగడ్డ మదనపడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎంను వల్లభనేని కలవబోతున్నారన్న వార్త గుప్పుమనగానే వెంకట్రావ్ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారని టాక్. 

Also Read:

వల్లభనేని వంశీపై ఇటీవలనే కేసు నమోదైంది. నకిలీ ఇళ్ల పట్టాలను ఇచ్చారని వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. గత ప్రభుత్వ హాయంలో ఇళ్ల  పట్టాల కోసం ఇచ్చిన స్థలంలోనే పట్టాలు ఇచ్చినట్టుగా వంశీ సీఎం జగన్ కు వివరణ ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయంలో తన ప్రమేయం లేదన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై కేసు పెట్టారని వంశీ వివరణ ఇచ్చారని సమాచారం.

ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్నినానితో కలిసి వంశీ జగన్ నివాసానికి చేరుకొన్నారు.రెండు రోజుల క్రితం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు.  ఆ తర్వాత వంశీ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్టుగా సమాచారం.

పార్టీ మార్పు విషయమై వంశీ తన అనుచరులతో చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం విషయమై ఇంకా స్పష్టత రాలేదు.అయితే పార్టీ మార్పు విషయమై వల్లభనేని వంశీ గురువారం నాడే స్పష్టత ఇచ్చారు.

Also Read:జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ: మతలబు ఏంటీ?

శుక్రవారం నాడు ఉదయం మాజీ కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని వంశీ కలిశారు.  సుజనా చౌదరితో  కిలిసా ఆయన కారులోనే వంశీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

సుజనా చౌదరితో భేటీ అయిన తర్వాత వల్లభనేని వంశీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలతో కలిసి భేటీ అయ్యారు. మంత్రుల కారులోనే వంశీ సీఎం జగన్ ఇంటికి చేరుకొన్నారు.

2014 ఎన్నికలకు ముందు విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన సమయంలో ఆసక్తికర సంఘలన చోటు చేసుకొంది. దమ్ము సినిమా చూసి వస్తున్న వల్లభనేని వంశీ గన్నవరం వెళ్తుండగా విజయవాడ బెంజీ సెంటర్ లో వైఎస్ జగన్ ర్యాలీగా వస్తున్నారు. ఆ సమయంలో జగన్ ర్యాలీగా వస్తున్న సమయంలో వల్లభనేని వంశీ కారును పోలీసులు ముందుజాగ్రత్తగా నిలిపివేశారు.

click me!