చంద్రబాబే సీఎం, వైసీపీకి 58సీట్లే, గాజువాక పవన్ దే: కాకపోతే జ్యోతిష్యం మానేస్తానన్న నైషధం శివరామశాస్త్రి

Published : May 04, 2019, 09:07 PM IST
చంద్రబాబే సీఎం, వైసీపీకి 58సీట్లే, గాజువాక పవన్ దే: కాకపోతే జ్యోతిష్యం మానేస్తానన్న నైషధం శివరామశాస్త్రి

సారాంశం

రూ.100 బాండ్ పేపర్ పై ఈ విషయం రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఒక ఛానెల్ నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న ఆయన ఈ ఎన్నికల్లో వైసీపీకి 58 సీట్లు వస్తాయని పవన్ కళ్యాణ్ గాజువాకలో మాత్రమే గెలుస్తారని చెప్పుకొచ్చారు. గాజువాకలో పవన్ కళ్యాణ్ 57,600 మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

విజయవాడ: ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు ప్రముఖ వాస్తు, జ్యోతిష్య, మంత్ర శాస్త్రనిపుణుడు నైషధం శిరామశాస్త్రి. మెుత్తం 112 సీట్లలో టీడీపీ విజయం సాధించడం ఖాయమని మళ్లీ సీఎం పీఠం చంద్రబాబుదేనన్నారు. 

రూ.100 బాండ్ పేపర్ పై ఈ విషయం రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఒక ఛానెల్ నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న ఆయన ఈ ఎన్నికల్లో వైసీపీకి 58 సీట్లు వస్తాయని పవన్ కళ్యాణ్ గాజువాకలో మాత్రమే గెలుస్తారని చెప్పుకొచ్చారు. 

గాజువాకలో పవన్ కళ్యాణ్ 57,600 మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఇది నిజం అన్నారు. ఒకవేళ కాకపోతే తాను జ్యోతిష్యం మానేస్తానని సవాల్ విసిరారు. 

నైషధం శివరామశాస్త్రి సవాల్ పై హేతువాద సంఘం నాయకులు స్పందించారు. ఇదే నిజమైతే రూ.5లక్షలు బహుమానంగా ఇచ్చి ఊరేగిస్తానన్నారు. అలాగే ఊరేగిస్తామని చెప్పుకొచ్చారు. హేతువాదుల ఆఫర్లను తిరస్కరించారు శివరామశాస్త్రి. 

చెంపలేసుకుని, తిరుమల వేంటకేశ్వరస్వామికి అంగ ప్రదక్షణ చేస్తే చాలని సూచించారు. ఇకపోతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు గెలుస్తారని తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu