120 సీట్లలో గెలుస్తాం, జగన్ ఏపీకి రానవసరంలేదు : మంత్రి కొల్లు రవీంద్ర

By Nagaraju penumalaFirst Published May 4, 2019, 6:51 PM IST
Highlights

కొల్లు రవీంద్ర మళ్లీ తెలుగుదేశం పార్టీకే ప్రజలు పట్టం కట్టారని తెలుస్తోందన్నారు. ఇకపోతే కేంద్రంలో బీజేపీకి అధికారంలోకి రావడం కల్ల అన్నారు. మోదీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడబోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించబోతుందన్నారు.

అమరావతి: ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించడం ఖాయమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 120 సీట్లలో విజయం సాధించడం ఖాయమన్నారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన కొల్లు రవీంద్ర మళ్లీ తెలుగుదేశం పార్టీకే ప్రజలు పట్టం కట్టారని తెలుస్తోందన్నారు. ఇకపోతే కేంద్రంలో బీజేపీకి అధికారంలోకి రావడం కల్ల అన్నారు. మోదీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడబోతుందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించబోతుందన్నారు. తెలుగుదేశం నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటవుతుందని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఏపీలో ఓటమి పాలవుతామని గ్రహించే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీకి రావడం మానేశారన్నారు. 

ఎన్నికలు పూర్తైన తర్వాత జగన్ ఏపీకీ రాలేదని ఇక రావాల్సిన అవసరం కూడా ఉండదన్నారు. ఇకపోతే చంద్రబాబుపై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేవీపీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ నేతగా పనిచేస్తున్నారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 

 

click me!