ఆయన వైసీపీకే అనుకూలం.. కుప్పంలో స్పెషల్ ఆఫీసర్‌ను తప్పించండి: హైకోర్టులో టీడీపీ లంచ్ మోషన్

Siva Kodati |  
Published : Nov 05, 2021, 06:30 PM IST
ఆయన వైసీపీకే అనుకూలం.. కుప్పంలో స్పెషల్ ఆఫీసర్‌ను తప్పించండి: హైకోర్టులో టీడీపీ లంచ్ మోషన్

సారాంశం

కుప్పం మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్‌గా లోకేశ్ వర్మ నియామకంపై టీడీపీ (tdp) ఏపీ హైకోర్టులో (ap high court) లంచ్ మోషన్ దాఖలు చేసింది. లోకేశ్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. తక్షణమే లోకేశ్వర వర్మను కుప్పం ఎన్నికల విధుల నుంచి తప్పించాలని తెలుగుదేశం పార్టీ (telugu desam party) పిటిషన్‌లో పేర్కొంది. 

ఏపీలో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు (local body elections) జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ (ysrcp) నేతలు ప్రతిపక్షాలను నామినేషన్లు వేయనీవ్వడం లేదంటూ టీడీపీ ఇప్పటికే ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు సైతం చేసింది. మరోవైపు కుప్పం మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్‌గా లోకేశ్ వర్మ నియామకంపై టీడీపీ (tdp) ఏపీ హైకోర్టులో (ap high court) లంచ్ మోషన్ దాఖలు చేసింది. లోకేశ్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. తక్షణమే లోకేశ్వర వర్మను కుప్పం ఎన్నికల విధుల నుంచి తప్పించాలని తెలుగుదేశం పార్టీ (telugu desam party) పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై సోమవారం హైకోర్టు విచారణ జరపనుంది. 

ALso Read:స్థానిక ఎన్నికలు: నామినేషన్ వెనక్కి తీసుకో.. లేదంటే, గిరిజన మహిళకు వైసీపీ నేత బెదిరింపులు, ఆడియో వైరల్

మరోవైపు కుప్పం మునిసిపాలిటీ 14వ వార్డులో టిడిపి తరపున పోటీచేస్తున్న అభ్యర్థిపై వైసిపి నాయకులు దాడికి పాల్పడ్డారు. దీంతో వైసిపి నాయకుల దౌర్జన్యకాండపై పిర్యాదుచేస్తూ టిడిపి చీఫ్ chandrababu రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్నికి లేఖ రాసారు. తమ అభ్యర్థిపై దాడిచేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని... ఇకపై ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలని neelam sahney ని కోరారు. kuppam మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. అధికార అండతో టిడిపి అభ్యర్థులను వైసిపి నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. కుప్పం మున్సిపాలిటీలోని 14వార్డు టిడిపి అభ్యర్థి వెంకటేశ్ నామినేషన్ వేయడానికి వెళ్ళగా వైసిపి నాయకులు దాడి చేసారని... అతడి చేతిలోని నామినేషన్ పత్రాలను కూడా లాక్కుని చించేసారనని పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రం వద్దే ఈ దాడి జరిగిందంటూ ఎస్ఈసి దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. 

ఒక్కసారిగా వెంకటేశ్ పైకి వచ్చిన దాదాపు 30మంది వైసిపి మద్దతుదారులు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. తమ పార్టీ అభ్యర్థిపై దాడికి పాల్పడినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఎస్ఈసిని కోరారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించిందని... ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్ కు చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని... ప్రతి అభ్యర్థి స్వేచ్చగా నామినేషన్ వేసేలా చూడాలని లేఖద్వారా ఎస్ఈసి నీలం సాహ్నిని కోరారు చంద్రబాబు. టిడిపి అభ్యర్థిపై వైసిపి శ్రేణుల దాడివిషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి (amarnath reddy) కుప్పం చేరుకున్నారు. బాధిత అభ్యర్థి వెంకటేశ్ ను పరామర్శించి దాడిని ఖండించారు. అండగా తామంతా వున్నామని...భయపడవద్దని అతడికి భరోసా ఇచ్చారు అమర్నాథ్ రెడ్డి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?