
అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ శుక్రవారంనాడు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల నుంచి రమేష్ గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యయారు. మే నెలలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు.
కాగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై, ఆయన కుమారుడు నారా లోకేష్ మీద ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ను తమ మీద రుద్దారని ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు. నారా లోకేష్ ను ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు. నారా లోకేష్ నాయకత్వంలోని పనిచేయాలని తమను రాచి రంపాన పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. నారా లోకేష్ నాయకత్వాన్ని పది శాతం మంది కూడా ఆంగీకరించబోరని ఆయన అన్నారు.
"
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన మాటలను తూచా తప్పకుండా పాటించి ప్రజలకు న్యాయం చేస్తున్నారని పంచకర్ల రమేష్ అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి చేస్తున్న కార్యక్రమాలకు ముగ్ధులై పార్టీలో చేరనున్నారు. రాష్ట్రంలో మంచి గెస్ట్ హౌస్ కట్టుకునే వీలు లేని విధంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారం కోల్పోయిన తరువాత ఏం చేయాలో అర్థం లేని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారన్నారు
చంద్రబాబు కొడుకు నాయకత్వాన్ని వద్దని ఆనాడే చెప్పానని పంచకర్ల తెలిపారు. జగన్ సిద్ధాంతాలకు లోబడి పార్టీలో కార్యకర్తల పని చేస్తానని తెలిపారు. ఉత్తరాంధ్ర కు సీఎం జగన్ వల్ల మంచి రోజులు వచ్చాయని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు సహకరించటం లేదని అన్నారు.. 13 జిల్లాల అభివృద్ధికి కృషి చేయడమే జగన్ ముఖ్య లక్ష్యం అన్నారు. వైయస్సార్ పార్టీ లో చేరేందుకు సహకరించిన విజయసాయి రెడ్డికి మంత్రి అవంతి శ్రీనివాస్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రమేష్ బాబుకు సముచిత స్థానం పార్టీలో కల్పిస్తామని విజయసాయి రెడ్డి అన్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చునని అన్నారు. న్యాయ స్థానాలపై గౌరవం ఉందన్నారు. న్యాయస్థానంలో రాజధాని విషయంలో న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి కులపిచ్చి ఉందని విజయసాయిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు
ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చిందంటే విశాఖ ప్రజలు పెట్టిన బిక్ష అని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో మీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఒక్క సీటు గెలిచిన తన పదవికి రాజీనామా చేస్తానని గతంలో చెప్పానని, ఇప్పుడు మరల చెప్తున్నానని అన్నారుఉత్తరాంధ్ర అభివృద్ధి యజ్ఞంలో జగన్మోహన్రెడ్డి ముందుకు వెళుతుంటే చంద్రబాబు అడ్డుతగలడం బాధాకరమన్నారు.