అన్న, వదినలకు ఎమ్మెల్యే రోజా స్పెషల్ విషెస్

By team teluguFirst Published Aug 28, 2020, 12:49 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆయన ధర్మ పత్ని భారతిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి శుభాకాంక్షలు తెలిపారు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆయన ధర్మ పత్ని భారతిల వివాహ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా వారిద్దరికీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మిత్రులు, శ్రేయోభిలాషులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, సహచరులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా కూడా ఈ సందర్భంగా వీరికి శుభాకాంక్షలు తెలిపారు. అన్నావదినమ్మలకు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. 

 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతుండడంతో... నిబంధలను పాటించకుండా నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తుంది. 

నిబంధనలు పాటించని మరో నాలుగు కోవిడ్ సెంటర్ల అనుమతులను రద్దు చేసింది. ఎలైట్ అడ్వాన్స్ కోవిడ్ 19 సెంటర్ (పాలి క్లినిక్ రోడ్), సాయి మాధవి కోవిడ్ సెంటర్, అనిల్ న్యూరో అండ్ ట్రామ్ కోవిడ్ సెంటర్, బిఎస్ శ్రీరామ్ ఆసుపత్రి(శశి ప్యారడైజ్) అనుమతులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.గతంలోనే ఐదు కోవిడ్ సెంటర్ల అనుమతిని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.

ఈ నెల 10వ తేదీన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లోని కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

ఈ సమయంలోనే ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండానే చాలా ప్రాంతాల్లో కోవిడ్ సెంటర్లను నిర్వహిస్తున్న విషయం తేలింది. దీంతో ప్రభుత్వం కోవిడ్ సెంటర్లపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

మరో వైపు రోగుల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూడ అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్న ఘటనలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన సెంటర్లపై విచారణ చేసి ప్రభుత్వం చర్యలు తీసుకొంది. రాష్ట్రంలోని 9 కోవిడ్ సెంటర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది.

click me!