భవిష్యత్ లో కోర్టు బోను ఎక్కక తప్పదు..: గుంటూరు డిఐజికి బుద్దా హెచ్చరిక

By Arun Kumar PFirst Published Sep 21, 2021, 4:58 PM IST
Highlights

చంద్రబాబు ఇంటికి జోగి రమేష్ ఇంటిపై దాడికి రాలేదంటూ గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ కట్టుకధ అల్లి అబద్దాలు చెబుతున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.

గుంటూరు: వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి రాలేదని... చంద్రబాబుతో మాట్లాడడానికే వచ్చారని గుంటూరు రేంజీ డీఐజీ త్రివిక్రమవర్మ అబద్దాలు చెప్పటం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఇలాంటి అధికారుల వల్ల మొత్తం పోలీసు వ్యవస్ధకు చెడ్డపేరు వస్తుందని వెంకన్న అన్నారు. 

''చంద్రబాబు ఇంటికి జోగి రమేష్ ఇంటిపై దాడికి రాలేదంటూ డీఐజీ కట్టుకధ అల్లి అబద్దాలు చెబుతున్నారు. పోలీసు డ్రెస్ వేసుకుని అబద్దాలు చెప్పడానికి సిగ్గుగా లేదా? పోలీసు వ్యవస్ధలో ఎంతో మంది నిజాయితీపరులున్నారు. కానీ ప్రమోషన్ల కోసం అధికార పార్టీకి వత్తాసు పలుకున్న త్రివిక్రమవర్మ లాంటి అధికారుల వల్లే మొత్తం పోలీసు వ్యవస్ధకు చెడ్డపేరొస్తోంది. త్రివిక్రమవర్మ వ్యాఖ్యలపై పోలీసు సంఘం కూడా స్పందించాలి'' అని బుద్దా డిమాండ్ చేశారు.

''ఏ హోదాలో జోగి రమేష్ చంద్రబాబును కలవడానికి వెళ్లారు?  డీఐజీ స్ధాయి వ్యక్తి మిమ్మల్ని కలవడానికే  పర్మిషన్ కావాలి... అలాంటిది మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్ష్యులు చంద్రబాబును పర్మిషన్ లేకుండా ఎలా కలుస్తారు? త్రివిక్రవర్మ తన వ్యాఖ్యలతో పోలీసు వ్యవస్ధ మొత్తాన్ని అవమానిస్తున్నారు'' అన్నారు. 

read more  సినీ పరిశ్రమను ఉప్పుతో పోల్చిన రఘురామ.. బెజవాడలో డ్రగ్స్ రాకెట్‌పై సంచలన వ్యాఖ్యలు

''జోగి రమేష్ రౌడీలను వేసుకుని చంద్రబాబు ఇంటికి వెళ్తే పోలీసులు ఆపరా? ఈ ఘటనలో టీడీపీ నాయకులపై జరిగిన దాడి, వారికి అయిన గాయాలు సీసీ పుటేజీల్లో పోలీసులకు కనపడలేదా? ఎందుకు పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో న్యాయమూర్తిలా జోగి రమేష్  క్లీన్ చీట్ ఇవ్వటానికి త్రివిక్రమవర్మకు ఏ అర్హత ఉంది?  పోలీసులు ఇలా వ్యవహరించటం గతంలో ఎప్పుడైనా జరిగిందా?  పోలీసులు అఖిలపక్ష నాయకుల సమావేశం ఏర్పాటు చేసి దాడి సంఘటన సీసీ పుటేజీలను చూపించగలరా?'' అని డిమాండ్ చేశారు.

''మీ ప్రమోషన్ల కోసం పోలీసు వ్యవస్ధను తాకట్టు పెట్టొద్దు. టీడీపీ నాయకుల్ని పోలీసులు చిన్నచూపు చూస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు.  ఎల్లకాలం ఈ ప్రభుత్వమే అధికారంలో ఉండదు. ఇప్పుడు పోలీసులు చేస్తున్న తప్పులకు భవిష్యత్ లో కోర్టు బోను ఎక్కక తప్పదు'' అని హెచ్చరించారు.

''త్రివిక్రమవర్మ అబద్దాలు చెప్పటం చూసి పక్కనున్న పోలీసు అధికారులు సైతం బాధపడుతున్నారు. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడి చేయటం ప్రజలంతా చూశారు. కానీ జోగి రమేష్ కి త్రివిక్రమమర్మ క్లీన్ చీట్ ఎలా ఇస్తారు? త్రివిక్రమవర్మ తన మాటలు వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి'' అని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

click me!