జగన్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు ఈసీ ఆదేశాలు

First Published Aug 23, 2017, 10:23 AM IST
Highlights
  • నంద్యాల రిటర్నింగ్ అధికారిని ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.
  • సంబంధిత ఆదేశాలు ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్ లాల్ కు కూడా అందాయి.
  • ఆదేశాలు ఈనెల 21వ తేదీనే అందినప్పటికీ ఎందుచేతనో బయటకు వెల్లడికాలేదు.
  • నంద్యాల ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా చంద్రబాబునాయుడును ఉద్దేశించి జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది.

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎప్ఐఆర్ నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నంద్యాల రిటర్నింగ్ అధికారిని ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. సంబంధిత ఆదేశాలు ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్ లాల్ కు కూడా అందాయి. ఆదేశాలు ఈనెల 21వ తేదీనే అందినప్పటికీ ఎందుచేతనో బయటకు వెల్లడికాలేదు. నంద్యాల ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా చంద్రబాబునాయుడును ఉద్దేశించి జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది.

రోడ్డుషోలో భాగంగా జగన్ మాట్లాడుతూ, ‘తప్పుడు హామీలివ్వటం, జనాలను పదే పదే మోసం చేస్తున్న చంద్రబాబును నడిరోడ్డులో కాల్చి పారేసినా తప్పు లేదనిపిస్తోంది’ అంటూ వ్యాఖ్యానించిన సంగతి అందరికీ తెలిసిందే. జగన్ వ్యాఖ్యలపై ఎంతటి  దుమారం రేగిందో అందరూ చూసిందే. చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా తనపై జగన్ చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రస్తావిస్తున్నారు.

జగన్ ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసారో లేక యధాలాపంగా అన్నారో తెలీదు కానీ మొత్తానికి జగన్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపింది. ఆ వ్యాఖ్యలపైనే ఈసీ సీరియస్ గా స్పందించింది. ఒక వ్యక్తి ప్రాణాలకు హానికలిగించే విధంగా ఎవ్వరూ మాట్లాడకూడదని అభిప్రాయపడింది. మొత్తానికి జగన్ పై కేసు నమోదు చేయాలన్న ఈసీ నిర్ణయం ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

click me!