శిల్పా సోద‌రులు ఇబ్బంది పెట్టిన‌, టీడీపీ భారీ విజ‌యం సాధిస్తుంది

Published : Aug 23, 2017, 08:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
శిల్పా సోద‌రులు ఇబ్బంది పెట్టిన‌, టీడీపీ భారీ విజ‌యం సాధిస్తుంది

సారాంశం

టీడీపీ భారీ విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా. ప్ర‌జ‌లు అభివృద్దిని కోరుకుంటున్నారు. వైసీపి నేత‌లు ఎంత రెచ్చ‌గొట్టిన తాము ప్ర‌శాంతంగా ఉన్నాము.

నంద్యాల ఉప- ఎన్నిక‌లో టీడీపీ భారీ విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు మంత్రి భుమా అఖిల ప్ర‌య. ప్ర‌జ‌లు అభివృద్దిని కోరుకుంటున్నారు అందుకే టీడీపీ వైపు మెగ్గు చూపార‌ని ఆమె తెలిపారు. పోలింగ్ శాతాన్ని త‌గ్గించడానికి వైసీపి నేత‌లు ప్ర‌య‌త్నించారు అయినా బూమా కుటుంబం వైపే ప్ర‌జ‌లు ఉన్నార‌ని ఆమె తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంత‌రం అఖిల మీడియాతో మాట్లాడారు.


వైసీపి నేత‌లు ఎంత రెచ్చ‌గొట్టిన తాము ప్ర‌శాంతంగా ఉన్నామ‌ని అఖిల తెలిపారు. నిన్న‌టి నుండి శిల్పా సోధ‌రులు చేసిన హంగామా ఇంత అంతా కాద‌ని.. అధికారంలో ఉన్న తాము మాత్రం ఎన్నిక‌ల కోడ్ ను గౌవ‌ర‌వించి మంత్రులు అంద‌రు త‌క్ష‌ణ‌మే భ‌య‌టికి వ‌చ్చాము.. కానీ శిల్పా సోద‌రుడు మాత్రం నంద్యాల్లో తిష్ట‌వేసి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టార‌ని ఆమె ఆరోపించారు. త‌న సోద‌రుడు త‌న‌కి స‌పోర్టు కోసం ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తే త‌న పైన కూడా నింధ‌లు వేస్తున్నార‌ని అది స‌రైనా చ‌ర్య కాద‌ని ఆమె పెర్కొన్నారు.


శిల్పా సోధ‌రులు త‌మ పై ఎన్నో నింద‌లు వేశార‌ని, చివ‌ర‌కు వారి అర‌చ‌కాల‌ను ప్ర‌జ‌లు గుర్తించారు, అందుకే వైసీపికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు స్వేచ్చ‌గా ఓటును వేశార‌ని ఆమె తెలిపారు. చాలా చ‌క్క‌టి వాతావ‌ర‌ణ‌లో ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని పెర్కోన్నారు.

 చంద్ర‌బాబు పైన జ‌గ‌న్ వ్యాఖ్య‌ల పై ఈసీ అల‌స్య‌మైనా స్పందించ‌డం అహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం అని అఖిల ప్రియా తెలిపారు
 

 

Read more at 

ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

 

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు | Asianet News Telugu
Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu