ఆంధ్రప్రదేశ్‌లో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో మాజీ సీఎం జగన్ లండన్ పర్యటనకు సిద్ధం అవుతున్నారంటూ టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. లండన్‌లో జగన్ అక్రమ ఆస్తుల గురించి ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. ప్రజలు కష్టాలు పడుతున్న సమయంలో ఈ పర్యటన ఎందుకు అని నిలదీశారు.
వరద బాధితులకోసం 74 ఏళ్ల వయస్సులో జేసీబీ ఎక్కి ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తపిస్తూ పనిచేస్తుంటే.. ప్రజల కన్నీళ్లు తడుస్తూ బురద నీటిలో కష్టపడుతుంటే.. ప్రజలు కష్టాల్లో ఉన్నా పట్టించుకోకుండా... జగన్ రెడ్డి లండన్ ఎందుకు వెళ్తున్నాడని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. దోచుకున్నది దాచుకోవడానికా?.. లండన్‌లో ఆస్తులు పెంచుకోవడానికా?.. నీరో చక్రవర్తికి వారసుడిలా ముసలికన్నీరు కార్చి.. ఐదు నిమిషాలు షో చేసి వెంటనే లండన్ ఎందుకు వెళ్తున్నట్లు..? అని నిలదీశారు. ఇదివరకే లండన్ లో జగన్‌కు ఆస్తులు ఉన్నట్లు సీబీఐ గుర్తించిందని చెప్పారు.
మరోవైపు లండన్‌లో జగన్ రెడ్డి దీవులను కొన్నాడని జనం అంటున్నారని మంత్రి స్వామి చెప్పారు. అది నిజమేనా? అని ప్రశ్నించారు. నిజంగా ప్రజల కష్టాల పట్ల చిత్తశుద్ధి ఉటే బాధితుల కోసం పనిచేయకుండా జగన్ లండన్ పోవాల్సిన పని ఏంటన్నారు. దానికి ఆయనే సమాధానం చెప్పాలన్నారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడారు. సమావేశంలో మాట్లాడారు. ‘‘మంత్రులను, నేతలను పరుగులు పెట్టిస్తూ… ప్రజలకోసం చంద్రబాబు కునుకులేకుండా శ్రమిస్తున్నారు. కలెక్టరేట్ నుండి పర్యవేక్షిస్తూ.. బస్సులో ఉంటూ బాధితులను ఆదుకుంటున్నారు. నడిచి వెళ్లలేనిచోట్ల జేసీబీ మీద ప్రయాణిస్తూ.. 74 ఏళ్ల వయస్సులో రాష్ట్ర ప్రజలకోసం శ్రమిస్తున్నారు. ప్రజలకు మంచినీళ్లు, ఆహరం, అందిస్తూ ఆదుకుంటున్నారు. ఇటుంవంటి పరిస్థితుల్లో జగన్ రెడ్డి బాధ్యతగల వ్యక్తి గా ప్రవర్తించకపోగా ప్రభుత్వంపై బురదచల్లడం సిగ్గుచేటు. నిజంగా జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ముందే బాధితుల కోసం ఎందుకు రాలేదు ? ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరిస్తే... ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లు ఎక్కిన జగన్. ఏ కారణాలతో పదే పదే లండన్ వెళ్తున్నాడు...? ఇక్కడ సంపాదించిన బ్లాక్ మనీని అక్క వైట్ చేసుకునేందుకని ప్రజలు అనుకుంటున్నారు. అదే నిజమా? అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక ఫ్లైట్లలో తిరిగి ప్రజల సొమ్ములను దిగమింగారు. ప్రజలు వరద నీటిలో ఇబ్బందుల్లో ఉంటే నాడు ఏరియల్ సర్వేలతో హెలికాఫ్టర్లలో తిరిగిన జగన్.. అసలు రాకుంటే ప్రజలు ఏమనుకుంటారోనని నిన్న గత్యంతరం లేక ఒక అరగంట బాధితుల వద్దకు వచ్చాడు. జగన్ చరిత్రలో ఏనాడు వరద బాధిత ప్రజల కోసం శ్రమించిన దాఖలాలు లేవు. ప్రజలకోసం కష్టపడే మా నాయకుల మీద బురద చల్లే ప్రయత్నం మానుకోవాలి. పేటియం బ్యాచ్ తో చేసే అసత్య ప్రచారాలు జగన్ మానుకోవాలి. మానాయకుడు ఎప్పుడూ.. క్షేత్ర స్థాయిలో తిరిగి ప్రజలకు రైతులకు అండగా ఉన్నాడు’’ తెలిపారు.
undefined
ప్రజలకు వాస్తవాలు చెప్పాలి..
‘‘అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్య ఉన్న వ్యక్తి చంద్రబాబు. ప్రజలకు ధైర్యం కల్పించిన వ్యక్తి చంద్రబాబు. ప్రజలను ఆదుకునే అలవాటు వైసీపీ నేతలకు లేదు. చేతనైతే ప్రజలకు సాయం చేయాలి కాని ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా? ప్రజలు ఇంత కష్టాల్లో ఉంటే జగన్ లండన్ ఎందుకు వెళ్తున్నాడని ప్రజలు మండిపడుతున్నారు. అక్కడ ఇంకా ఆస్తులు కొనుక్కోవడానికేనా? జగన్ లండన్ పర్యటన వెనుక ఉన్న అసలు నిజాలు ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. నీరో చక్రవర్తికి వారసుడిలా ఎక్కడ గేట్లు ఉన్నయో.. ఎక్కడ గేట్లు లేవో కూడా తెలియని అజ్ఞానంతో ఉన్న వ్యక్తి గత ఐదేళ్లు పరిపాలించాడు. బుడమేరును వెడల్పు చేసేదుకు మా ప్రభుత్వంలో టెండర్లు పిలిస్తే.. దాన్ని అడ్డుకొని బుడమేరును పిల్లకాలువ చేసి బుడమేరుకు గండ్లు పెట్టిన చరిత్ర జగన్ దే. విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వరదలు వచ్చాయంటే దానికి కారణం జగన్ అజ్ఞాన పాలన వలనే. ఇకనైనా వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. నేడు అనుభవజ్ఞుడైన నాయుడు మమ్మల్ని నడిపిస్తోనాడు. నేడు లక్షాలాది మందికి ఆహారం అందిస్తున్నాం. మా చిత్తశుద్ధిని గమనించాలి. ఒక్కసారి అంటే ప్రజలు నమ్మి గతంలో వైసీపీ నేతలకు అధికారం ఇచ్చారు. వైసీపీ అరాచక పాలన చూసి వారిని శాశ్వతంగా తరిమి కొట్టారు. చిత్త శుద్ధి ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు ప్రజలకు అండగా ఉండాలి’’ అని హితవు పలికారు మంత్రి బాలవీరాంజనేయ స్వామి.
అక్రమ సొమ్ములను వైట్ చేసుకోవడానికేనా?
‘‘జగన్ రెడ్డి దనదాహం అంతా ఇంత కాదు. ఇసుక, లిక్కర్ ప్రతిదానిలో మోసమే. తన లక్ష్యం ఒక్కటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన లక్షలాదికోట్లు, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన అక్రమ సొమ్ములను వైట్ చేసుకోవడానికే లండన్ వెళ్తున్నాడు. ప్రజలు రోధిస్తున్నా.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తే... నేడు చిక్కని చిరునవ్వులతో జగన్ రెడ్డి లండన్ వెళ్తున్నాడు. గతంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి ప్రజల ప్రాణాలు పోతే ఆయన, తన మంత్రలు నవ్వులతో సెల్ఫీలు తీసుకున్నారంటే.. వాళ్లను ఏమనుకోవాలి.. వెకిలినవ్వుల జగన్ ఆయన చేష్టలను ప్రజలు అర్థం చేసుకోవాలి. వీలైంనతవరకు ప్రజల ప్రాణాలను కాపాడేందుకే మా ముఖ్యమంత్రి, మాప్రభుత్వం కృషి చేసింది. అమరావతిలో ఒక్క చుక్క నీరు లేదు. వైసీపీ నేలకు దమ్ముంటే రండి వెళ్లి చూద్దాం. వైసీపీ నేతల కళ్లకు కొట్టినట్లు ఉండి అసత్య ప్రచారం చేస్తున్నారు. దీనిపై చట్టపరమైన చ్యలు తీసుకుంటాం’’ అని మంత్రి వీరాంజనేయ స్వామి హెచ్చరించారు.