గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోపై స్పీకర్ కు ఫిర్యాదు: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

By narsimha lode  |  First Published Aug 9, 2022, 11:50 AM IST

వైసీపీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు చెందిన అశ్లీల వీడియో విషయమై చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఈ తరహా వ్యవహారాన్ని వైసీపీ సమర్ధించుకోవడాన్ని టీడీపీ తప్పుబట్టింది. 


న్యూఢిల్లీ:YCP కి చెందిన హిందూపురం ఎంపీ Gorantla Madhav అశ్లీల వీడియోపై  లోక్ సభ స్పీకర్ కు పిర్యాదు చేసినట్టుగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పారు.మంగళవారం నాడు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా వ్యవహరించడంతో అందరు ఎంపీలు ఇలానే ఉంటారా అనే అనుమానం ప్రజలకు వచ్చే అవకాశం ఉందన్నారు.

ఈ విషయమై స్పీకర్  OM  Birla కు తాము లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. ప్రత్యేక హోదా  సహా రాష్ట్రానికి చెందిన సమస్యలపై మాత్రం వైసీపీ ఎంపీలకు  పట్టించుకోవడం లేదని  ఆయన విమర్శించారు. కానీ జగన్ కు సంబంధించిన కేసుల విషయమై  వైసీపీ ఎంపీలు మాత్రం ఢిల్లీ మొత్తం తిరుగుతారన్నారు. వైసీపీపై ఎవరైనా ఎంపీ ఎదురు తిరిగితే ఆ పార్టీ ఎంపీలంతా  కూడా ఢిల్లీలోనే ఉండి  ఎదురు తిరిగిన ఎంపీపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ చుట్టూ తిరిగారని ఆయన గుర్తు చేశారు.
Hindupur ఎంపీ గోరంట్ల మాధవ్  పై చర్య తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తుంటే ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం వైసీపీ ఎంపీలు  ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఎంపీ మాధవ్ వ్యవహరాన్ని ఎలా మేనేజ్ చేయాలనే విషయమై వైసీపీ ప్రయత్నిస్తుందన్నారు. BJPతో వైసీపీ అత్యంత సన్నిహితంగా ఉందని చెప్పుకొనేందుకు  ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుందన్నారు. కానీ రాష్ట్రానికి చెందిన సమస్యల విషయంలో వైసీపీ ఎంపీలు ఏం చేయడం లేదన్నారు.

Latest Videos

undefined

also read:గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో : అనితారెడ్డి ఫిర్యాదుపై ఐదుగురి మీద కేసు

మహిళల సంరక్షణ, మహిళల గౌరవంతో ముడిపడిన సమస్య కాబట్టి ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్య తీసుకోవడానికి వెనుకాడుతున్నారన్నారు. మాధవ్ పై చర్యలు తీసుకొంటే వైసీపీలోనే చాలామందిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే భయంతో ఆ పార్టీ ఈ విషయమై వెనుకాడుతుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.  గోరంట్ల మాధవ్  వీడియోను TDP మార్ఫింగ్ చేసిందని ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు.

ఈ తరహా వీడియోలు చేయాల్సిన దౌర్భాగ్యం తమ పార్టీకి రాలేదని ఆయన చెప్పారు. గోరంట్ల మాధవ్ వీడియో అసలుదని తేలితే చర్యలు తీసుకొంటామని తొలుత ప్రకటించిన వైసీపీ నేతలు ఆ తర్వాత ఎందుకు మాట మార్చారో చెప్పాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కోరారు. గోరంట్ల మాధవ్  విషయం నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త కొత్త అంశాలను వైసీపీ తెరమీదికి తీసుకువస్తుందన్నారు.

మాధవ్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపడానికి ఎన్ని రోజులు పడుతుందని  ఎంపీ అడిగారు. గోరంట్ల మాధవ్ చేసిన పనికి ఎంపీలుగా తాము కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చిందన్నారు.ఎంపీ మాధవ్ విషయాన్ని వైసీపీ సిగ్గులేకుండా సమర్ధించుకుంటుందని ఆయన విమర్శించారు.గత వారంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్  గా మారింది. దీంతో ఈ వీడియో విషయమై హిందూపురం ఎంపీ న్యూఢిల్లీలోనే  మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. తన జిమ్ వీడియోను మార్పింగ్ చేశారని ఆయన చెప్పారు. టీడీపీకి చెందిన నేతలు తన వీడియోను మార్ఫింగ్ చేశారని ఆయన  చెప్పారు.ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా ఆయన వివరించారు. 
 

click me!