గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో : అనితారెడ్డి ఫిర్యాదుపై ఐదుగురి మీద కేసు

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడ్ ముగిసేలా లేదు. ఆ వీడియో తనను మార్ఫింగ్ చేశారంటూ అనితారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. 

Gorantla Madhav nude video : Case against five people on Anita Reddy's complaint In Andhrapradesh

సత్యసాయి జిల్లా : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిమీద ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. కాగా, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారంలో ఆయన పక్కన తన ఫొటో పెట్టి.. తన మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ.. కద్రి ప్రాంతంలోని గాండ్లపెంటకు చెందిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాలంటీర్ అనితారెడ్డి టీడీపీ, జనసేన ల మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎస్ఐ మల్లికార్జునరెడ్డి సోమవారం తెలిపారు. అనితారెడ్డి ఆదివారం ఈ మేరకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అబ్దుల్ కరీమ్, వేణు, బొప్పూరి రమణ, చందు, నవీన్ కుమార్ అనే ఐదుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ నిందితుల్లో అబ్దుల్ కరీమ్ మంగళగిరి వాసిగా పోలీసులు గుర్తించారు. మిగతా నలుగురు ఏ ప్రాంతం వారు అన్న దాని మీద విచారణ చేస్తున్నారు. 

గోరంట్ల మాధవ్ కంటే చంద్రబాబు ఓటుకు నోటు కేసే పెద్దది: సజ్జల రామకృష్ణారెడ్డి

కాగా,  ఓ మహిళతో వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా మాట్లాడిన వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు గోరంట్ల మాధవ్ తీరుపై మండిపడుతున్నారు. ఎంపీగా ఉంటూ  ఇవేం పనులు అంటూ.. విరుచుకుపడుతున్నారు. మహిళతో నగ్నంగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో మాధవ్ సీఐగా పనిచేస్తున్న సమయంలో ఓ మహిళతో ఇలాగే మాట్లాడారు అని ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ అధికారిగా, ఎంపీగా ఆయన తీరు ఎప్పుడూ వివాదాస్పదమేనని పలువురు అంటున్నారు.

మాధవ్ న్యూడ్ వీడియో వివాదం.. టీడీపీ జ‌న‌సేన నేత‌ల‌పై వైసీపీ మ‌హిళా నేత ఫిర్యాదు

కాగా ఈ వీడియోపై హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తనను ఇబ్బంది పెట్టి డ్యామేజ్ చేయడానికి కుట్ర చేస్తోందని అన్నారు. తనపై వచ్చిన రాసలీలల వీడియోపై స్పందించిన ఎంపీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరు వంశీ, శివ కృష్ణలు ఓ చెత్త వీడియోను పోస్ట్ చేశారని మండిపడ్డారు. వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని అన్నారు. వారికి దమ్ము, ధైర్యం ఉంటే తనని స్ట్రెయిట్గా ఎదుర్కోవాలని అన్నారు. తాను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోను మార్ఫింగ్ చేసి ఈ చెత్త వీడియోలను సృష్టించారని అన్నారు. ఈ కుట్రలో  అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు కూడా ఉన్నారని తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు.

కాగా, ఈ వీడియోను ఫొరెన్సిక్ కు పంపించారు. ఒకవేళ ఈ వీడియో మార్ఫింగ్ కాదని.. మాధవ్ తప్పు అని తేలితే.. అతని మీద చర్యలు తీసుకుంటామని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇలాంటి వాటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహించదని, నిజమని తేలితే అందరికీ ఒక గుణపాఠంలా చర్యలు ఉంటాయని సజ్జల పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios